విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ‘‘తెలుగుదేశంపై టీఆర్‌ఎస్‌ పగ పెట్టుకుంది. పరస్పరం సహకరించుకునే ధోరణి ప్రదర్శించడంలేదు'' మంగళవారం విజయవాడలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు అన్న మాటలివి. వీటిని బట్టి చూస్తుంటే రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందన్నారు. తెలుగు ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు, విద్వేషాలు లేనప్పటికీ, తెలుగుదేశం పార్టీపై పగ తీర్చుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను కొంటోందని అన్నారు. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉదంతంపై ఈ దీక్షలో పరోక్షంగా మాట్లాడారు.

‘‘టీఆర్‌ఎస్‌ పార్టీ ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను, ఐదుగురు కాంగ్రెస్‌ సభ్యులను, ఇద్దరు వైయస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం దౌర్జన్యం చేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్‌కు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్‌కు ఓటేయడం సిగ్గుమాలిన పని. వైయస్ జగన్ తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎలా మద్దతు ఇచ్చారు'' అని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌, వైయస్‌ఆర్ కాంగ్రెస్ కలిసి టీడీపీని దెబ్బతీయాలని చూసినా, తాను ఎదురు నిలిచి పోరాడతానని అన్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ విలువులున్న పార్టీ అని, తప్పుడు రాజకీయాలు చేయబోనని చంద్రబాబు తెలిపారు. ఇది ఇలా ఉంటే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు

టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు

‘‘తెలుగుదేశంపై టీఆర్‌ఎస్‌ పగ పెట్టుకుంది. పరస్పరం సహకరించుకునే ధోరణి ప్రదర్శించడంలేదు'' మంగళవారం విజయవాడలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు అన్న మాటలివి. వీటిని బట్టి చూస్తుంటే రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

 టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు

టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు


తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని అన్నారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు, విద్వేషాలు లేనప్పటికీ, తెలుగుదేశం పార్టీపై పగ తీర్చుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను కొంటోందని అన్నారు. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉదంతాన్ని కూడా ఈ దీక్షలో పరోక్షంగా ప్రస్తావించారు.

టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు

టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు


‘‘టీఆర్‌ఎస్‌ పార్టీ ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను, ఐదుగురు కాంగ్రెస్‌ సభ్యులను, ఇద్దరు వైయస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం దౌర్జన్యం చేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్‌కు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్‌కు ఓటేయడం సిగ్గుమాలిన పని. వైయస్ జగన్ తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎలా మద్దతు ఇచ్చారు'' అని విమర్శించారు.

టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు

టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు


టీఆర్‌ఎస్‌, వైయస్‌ఆర్ కాంగ్రెస్ కలిసి ఎన్నిప్రయత్నాలు చేసినా తాను రాజీపడబోనని, ఎదురు నిలిచి పోరాడతానని ప్రకటించారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ విలువులున్న పార్టీ అని, తప్పుడు రాజకీయాలు చేయబోనని చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు

టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు


‘ఓటుకు నోటు' కేసులో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ముట్టచెబుతూ రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారుల వలలో చిక్కిన విషయం తెలిసిందే.

 టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు

టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు


ఇందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున అధికారులు ఈసీకి నివేదిక సమర్పించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యుడొకరు ధ్రువీకరించారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డిని దోషిగా తేల్చటానికి పక్కా ఆధారాలు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం, వాటన్నింటినీ ఈసీకి సమర్పించాలని యోచిస్తోంది.

 టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు

టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు

కేసు తీవ్రత దృష్ట్యా రేవంత్‌ సభ్యత్వాన్ని రద్దు చేయటమేకాక, ఆయన ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఈసీని ప్రభుత్వం కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు

టీడీపీపై టీఆర్ఎస్ పగ: దీక్షలో బాబు


ఈసీ స్పందించకపోతే, శాసనసభ ద్వారా రేవంత్‌పై చర్యలకు ఉపక్రమించాలనేది టీఆర్‌ఎస్‌ వ్యూహంగా చెబుతున్నారు. ఇందుకోసం ఈ నెల చివర్లో లేదా జూలై మొదటి వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఏర్పాటు చేసే అవకాశముందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది.

English summary
Chandrababu fires on kcr government at navanirmana deeksha at Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X