హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్మికులకు వరాలు: మేడేలో కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లు, ట్రక్కులు సహా వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల ఉపాధి భద్రత, సంక్షేమంకోసం తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

కార్మికులలో నైపుణ్యం పెంచడానికి జిల్లాకు ఒక స్కిల్ బిల్డింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికుల కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయ మొత్తాలను పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. రవీంద్ర భారతిలో శుక్రవారం జరిగిన ‘మే'డే వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని కార్మికులకు కొత్తగా ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించారు.

ఈ పథకాన్ని ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తోన్న 5 లక్షల 8 వేలమంది డ్రైవర్లు (ఆటోలు, లారీలు, వ్యాన్లు, క్యాబ్స్, ట్రక్కులు), 16 వేలమంది హోంగార్డులు, 12 వేలమంది జర్నలిస్టులకు వర్తిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. కార్మికుల సంక్షేమం గురించి గత ప్రభుత్వాలు కనీసం ఆలోచించిన చరిత్ర లేదని ముఖ్యమంత్రి విమర్శించారు. తాము ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వకపోయినా రాష్టవ్య్రాప్తంగా 3 లక్షల 70 వేలమంది బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.

బీడీ కార్మికులకు చెల్లిస్తున్న భృతివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.450 కోట్ల భారం పడుతున్నా వెనుకడుగు వేయలేదని ముఖ్యమంత్రి అన్నారు. బీడీ కార్మికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తనకు బాగా తెలుసని, తాను చిన్నప్పుడు బీడీ కార్మికుల ఇళ్లలో ఉండి చదువుకున్నానని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వకున్నా కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు.

మే డే వేడుకలు

మే డే వేడుకలు

రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లు, ట్రక్కులు సహా వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

మే డే వేడుకలు

మే డే వేడుకలు

ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల ఉపాధి భద్రత, సంక్షేమంకోసం తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

కేంద్రమంత్రి దత్తాత్రేయతో సిఎం కెసిఆర్

కేంద్రమంత్రి దత్తాత్రేయతో సిఎం కెసిఆర్

కార్మికులలో నైపుణ్యం పెంచడానికి జిల్లాకు ఒక స్కిల్ బిల్డింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

హోంమంత్రి నాయినితో..

హోంమంత్రి నాయినితో..

కార్మికుల కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయ మొత్తాలను పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.

డిప్యూటీ సిఎం కడియంతో..

డిప్యూటీ సిఎం కడియంతో..

రవీంద్ర భారతిలో శుక్రవారం జరిగిన ‘మే'డే వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని కార్మికులకు కొత్తగా ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ పథకాన్ని ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తోన్న 5 లక్షల 8 వేలమంది డ్రైవర్లు (ఆటోలు, లారీలు, వ్యాన్లు, క్యాబ్స్, ట్రక్కులు), 16 వేలమంది హోంగార్డులు, 12 వేలమంది జర్నలిస్టులకు వర్తిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.

గాంధీభవన్‌లో..

గాంధీభవన్‌లో..

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఎన్టీఆర్ భవన్‌లో..

ఎన్టీఆర్ భవన్‌లో..

ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేతలు మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నేతలు మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ భవన్‌లో...

తెలంగాణ భవన్‌లో...

తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమతి నేతలు మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఎంబి భవన్‌లో..

ఎంబి భవన్‌లో..

ఎంబి భవన్‌లో నేతలు మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఏఐటియుసి

ఏఐటియుసి

మే డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న ఏఐటియుసి నేతలు.

భవన నిర్మాణ కార్మికులకు ఇప్పటి వరకు ఉన్న ప్రమాద బీమా పథకాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామని ప్రకటించారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు చెల్లిస్తున్న ప్రసూతి భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామన్నారు. భవన నిర్మాణ రంగంలో ప్రమాదవశాత్తూ గాయపడి వికలాంగులైన కార్మికులకు రూ.30 వేలు ఉన్న నష్టపరిహారాన్ని రూ.60 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు.

అలాగే ప్రమాదవశాత్తూ గాయపడి ఆస్పత్రి పాలైన కార్మికులకు నెలనెలా చెల్లించే భృతిని 15 వందల నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే భారీ మిషన్లు తయారు చేసే పరిశ్రమలు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారీ మిషన్లన్నింటినీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితిలోనే ఉన్నామన్నారు. దేశంలోనే అన్ని యంత్ర పరికరాలను తయారు చేసేందుకు ‘మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి అన్నారు.

కార్మికులకు ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి ఏవిధమైన పరిశ్రమలు స్థాపించాలో ప్రధాన మంత్రితో చర్చించడానికి నివేదిక తయారు చేసుకున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తమ ప్రభుత్వం రూపొందించిందని, త్వరలోనే దానికి శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి అన్నారు.

English summary
Chief Minister K. Chandrasekhar Rao on Friday showered `boons’ on the working classes with a slew of announcements that included free accident insurance of Rs.5 lakh covering a range of workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X