తెరాస వ్యూహం: మంత్రి భార్య రెండోసారి (పిక్చర్స్)

హైదరాబాద్: రంగారెడ్డి జడ్పీ పీఠం తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది. జడ్పీ చైర్ పర్సన్‌గా తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి పి సునీతారెడ్డి ఎన్నికయ్యారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు టీడీపీ సభ్యులు మద్దతు పలకడంతో సునీతా రెడ్డి ఎన్నిక సునాయాసమైంది. చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న టీడీపీ వైస్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకుంది.

టీడీపీ జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తెరాసకు బలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులను తెరాస తమవైపు తిప్పుకోవడంతో తెరాస బలం 14కు పెరిగింది. టీడీపీ సభ్యులు కూడా జారిపోతారని భావించిన కాంగ్రెస్‌ చైర్మన్‌ పదవిని టీడీపీకి ఇచ్చేందుకు తాను వైస్‌ చైర్మన్‌ పదవి తీసుకునేందుకు సిద్ధపడింది. అయితే ఆదివారం ఉదయానికి సీను మారిపోయింది. టీఆర్‌ఎస్‌తో కలిసి వెళ్లాలని టీడీపీ జిల్లా నాయకత్వం నిర్ణయించింది.

దీంతో తెరాసతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ పార్టీకి చైర్మన్‌ పదవిని ఇచ్చి టీడీపీ వైస్‌ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతా రెడ్డికి 21 మంది ఓటేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జంగారెడ్డికి 12 ఓట్లు వచ్చాయి. దీంతో సునీతా రెడ్డి చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు కలెక్టర్‌, ఎన్నికల అధికారి శ్రీధర్‌ ప్రకటించారు. దీంతో వరుసగా రెండోసారి రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌గా సునీతారెడ్డి ఎన్నికయ్యారు. గతంలో ఆమె టీడీపీ తరఫున జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

సునితా మహేందర్ రెడ్డి

సునితా మహేందర్ రెడ్డి

రంగారెడ్డి జడ్పీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి టీడీపీని తమ వైపుకు తిప్పుకుంది. టీడీపీకి అనేక ఆఫర్లు ఇచ్చిన కాంగ్రెస్‌ చివరకు తానే నష్టపోయింది. దీంతో సునితా మహేందర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు.

ప్రభాకర్ రెడ్డి

ప్రభాకర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ తగిన వ్యూహరచన లేక చతికిలపడింది. మెజారిటీ సభ్యులను గెల్చుకున్నప్పటికీ జడ్పీ పీఠాన్ని చేజార్చుకోవడం కాంగ్రెస్‌కు వరుసగా ఇది మూడోసారి. తెరాసకు మద్దతులో భాగంగా టీడీపీ ప్రభాకర్ రెడ్డిని వైస్ వరించింది.

సునితా మహేందర్ రెడ్డి

సునితా మహేందర్ రెడ్డి

రంగారెడ్డి జడ్పీ పీఠం తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది. జడ్పీ చైర్ పర్సన్‌గా తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి పి సునీతారెడ్డి ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న సునితా

సునితా మహేందర్ రెడ్డి

సునితా మహేందర్ రెడ్డి

రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్‌గా తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి పి సునీతారెడ్డి ఎన్నికయ్యారు. పక్కన మంత్రి మహేందర్ రెడ్డి.

సునితా మహేందర్ రెడ్డి

సునితా మహేందర్ రెడ్డి

రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్‌గా తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి పి సునీతారెడ్డి ఎన్నికయ్యారు. ఆమెను అభినందిస్తున్న తెరాస నేతలు.

సునితా మహేందర్ రెడ్డి

సునితా మహేందర్ రెడ్డి

రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్‌గా తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి పి సునీతారెడ్డి ఎన్నికయ్యారు. ఆమెను అభినందిస్తున్న తెరాస మహిళా నేతలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+