బాబును ఆకాశానికెత్తారు, పదనిసలు (పిక్చర్స్)

హైదరాబాద్: పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. పార్టీని అధికారంలోకి తెచ్చిన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబ నాయుడిని ఆకాశానికెత్తారు. ప్రశంసల జల్లు కురిపించారు. మహానాడు తొలి రోజు మంగళవారం నాయకులు పోటీ పడి చంద్రబాబును ప్రశంసించారు.

సభ ప్రారంభానికి గంట ముందు నుంచే గండిపేట రోడ్డు సుమారు 6 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలూ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నారు. ఎంపి జెసి మూడు కిలో మీటర్లు నడిచి ఉసూరుమన్నారు. పార్టీ నాయకులు టి. దేవేందర్‌గౌడ్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలో కనిపించలేదు. అయితే ట్రాఫిక్ జామ్‌లో గంటకు పైగా ఉండి, విసిగిపోయి వెనక్కి తిరిగారని సమాచారం.

బాబు పులిహోర తిన్నారు

ట్రాఫిక్ జామ్ కారణంగా భోజన విరామ సమయానికి చంద్రబాబు క్యారేజీ రాకపోవడంతో, అక్కడే కొంత పులిహోర తిన్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ను వేదికపైకి ఆహ్వానించలేదు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో ఆయన కూర్చున్నారు చంద్రబాబు బావమరుదులు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణను వేదికపై ముందు వరుసలో కూర్చున్నారు.

కాగా హరికృష్ణను నాయకులు, కార్యకర్తలు పెద్దగా పట్టించుకోలేదు, కానీ బాలకృష్ణ ప్రాంగణానికి వచ్చినప్పుడు ఆయనతో చేతులు కలిపేందుకు, ఫొటోలు దిగేందుకు కార్యకర్తలు పోటీ పడడంతో కొంత తొక్కిసలాట జరిగింది. భోజనాలు 30 వేల మందికే సిద్ధం చేయిస్తే, 50 వేల మంది వరకు ప్రతినిధులు వచ్చినందున కొంత ఇబ్బంది అయ్యిందని చంద్రబాబు ప్రకటించారు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన కింజారపు ఎర్రన్నాయుడు తనయుడు, ఎంపి కె. రాంమోహన్ నాయుడు చేసిన ప్రసంగం సభికులను ఉర్రూతలూగించింది. రాష్ట్రాన్ని విభజించినా, తెలంగాణ ప్రజలకు తాము అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా పరిష్కరించడంలో ముందుంటామని చెప్పారు.

బాబుపై ప్రశంసలు

బాబుపై ప్రశంసలు

మహానాడు తొలి రోజు మంగళవారంనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు.

హరికృష్ణ వచ్చారు కానీ...

హరికృష్ణ వచ్చారు కానీ...

మహానాడుకు మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ వచ్చారు. సోదరుడు బాలకృష్ణ వేదికపై కూర్చున్నారు.

వంటలు పసందు...

వంటలు పసందు...

మహానాడుకు 30 వేల మంది వస్తారని వంటలు చేయిస్తే 50 వేల మంది దాకా వచ్చారు. పూర్తిగా సందడి చోటు చేసుకుంది.

పార్టీకి యువరక్తం..

పార్టీకి యువరక్తం..

శాసనసభ్యురాలు పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ మహానాడులో ఇలా కనిపించారు. నారా లోకేష్ కూడా చిత్రంలో ఉన్నారు.

వేదికపై బాలకృష్ణ

వేదికపై బాలకృష్ణ

చంద్రబాబు నాయుడితో పాటు హిందూపురం శాసనసభ్యుడు నందమూరి హరికృష్ణ వేదికపై ఉన్నారు. హరికృష్ణ అటు, బాలకృష్ణ ఇటు అయ్యారు.

నారా లోకేష్ ఇలా...

నారా లోకేష్ ఇలా...

మహానాడులో నారా లోకేష్ సందడి చేశారు. నోట్స్ తీసుకుంటూ, ఇతరులను పలకరిస్తూ నారా లోకేష్ కనిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+