ఎపిఎన్జీవో: అశోక్ బాబుకు జగన్ చెక్ చెబుతారా?

ఇరువర్గాల తరఫున 17 మంది చొప్పున ప్యానల్ తయారయింది. వీరంతా ఆదివారం ఎపిఎన్జీవో హోంలో నామినేషన్లను దాఖలు చేశారు. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగింది. ఈ ఉద్యమాన్ని ఎపిఎన్జీవోలు ముందుండి నడిపించారు. దీంతో ఎపిఎన్జీవోకు సీమాంధ్రలో ప్రాధాన్యత ఏర్పడింది. దీనిని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎపిఎన్జీవోలు శనివారం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దూరంగా ఉంది. అశోక్ బాబుపై జగన్ వైఖరి కారణంగానే ఆ పార్టీ దూరంగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ బాబును ఓడించి ఎపిఎన్జీవోపై పట్టు సాధించే దిశలో జగన్ పావులు కదుపుతున్నారంటున్నారు. అందుకు ఎపిఎన్జీవో ఎన్నికలను జగన్ ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎపిఎన్జీవోలో చీలిక తీసుకు వచ్చి తమకు అనుకూలంగా ఉండే వారిని గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఆదివారం నామినేషన్ అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ... ఎన్నికలు సజావుగానే సాగుతాయని, 17 మంది సభ్యుల తమ ఫ్యానల్ విజయం సాధిస్తుందని, ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎప్పుడు గతంలో జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications