ఆరు రోజుల బిడ్డను రూ. అరవై వేలకు అమ్మేశారు..
ఆరు రోజుల బిడ్డను డబ్బుల కోసం రూ. అరవై వేలకు అమ్మేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో చోటుచేసుకుంది. తన ఆరు రోజుల మనవరాలిని పిల్లల అక్రమరవాణాకు అప్పగించినట్లు ఓ మహిళపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆ మహిళ పరారీలో ఉంది. ఆమెను పట్టుకునేందుక పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఆ పసికందు కనిపించకపోవడంతో తల్లి హుటాహుటినా శాంతినగర్‌లోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
రూ. 60 వేలకు అమ్మేసింది: ఈ ఘటలోని ఖలీదా బీబీ అనే మహిళా ఆ పసికందును విక్రయించే ఏజంటుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనలో మరో మహిళ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె కూడా పరారీలో ఉంది. అయితే అక్టోబర్ 9వ తేదిన ఆ బిడ్డకు జన్మనిచ్చింది ఆ మహిళ. మూడురోజుల తర్వాత ఆ పసికందును తీసుకుని మహిళ తన తల్లి ఇంటికి వెళ్లింది. ఆ బిడ్డను విక్రయించాలని ఆ మహిళ తల్లి ఒత్తిడి చేయడం ప్రారంభించింది.

కానీ ఆ పనికి బిడ్డ తల్లి ఒప్పుకోలేదు. అయితే ఈక్రమంలో అక్టోబర్ 15వ తేదీన బిడ్డ కనిపించకుండా పోయింది. దాంతో ఆ మహిళ తన తల్లిని నిలదీయగా అసలు నిజం బయటపడింది. స్థానిక ఏజంట్ సహాయంతో ఆరురోజుల పసికందును మహిళ తల్లి అరవై వేలకు విక్రయించినట్లు కూతురి దగ్గర ఒప్పకుంది. దీంతో వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఈ విషయాన్నంతా ఆ మహిళ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం తెలిసేలోపే నిందితులు అక్కడినుండి తప్పించుకున్నారు.
నా బిడ్డను నాకు అప్పగించండి: అయితే ఆ మహిళ భర్త పశ్చిమబెంగాల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, ప్రసవం అనంతరం తల్లి చెంతకు వెళ్లడమే ఉత్తమం అని భావించిన ఆ మహిళ ఆ నవజాత శిశువును తీసుకుని తల్లి చెంతకు చేరింది. కానీ, అప్పటికే ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం సరిగా లేని ఆ తల్లి ఏకంగా మనవరాలినే అమ్మేసేందుకు సిద్ధమయ్యింది.
ఆమె అనుకున్నట్లుగానే స్థానిక ఏజంట్ సాయంతో బిడ్డను అమ్మేసి అక్కడి నుంచి పారిపోయింది. పోలీసులు నా కూతురు ఎక్కడుందో కనుక్కుని నా దగ్గరకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటి ఘోరానికి పాల్పడిన నా తల్లికి పోలీసులు ఏ శిక్ష అయినా విధించండి అంటూ ఆ మహిళ పోలీసులను వేడుకుంది.












Click it and Unblock the Notifications