వైయస్ జగన్ గార్డియన్ గా జనార్ధన్ రెడ్డి!

కడప ఎంపీ జగన్ కి మంచి భవిష్యత్తు ఉందని, ఆయనకు తాము మద్దతిస్తామని నిన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తెలిపారు. అయితే ఆయన అధిష్ఠానం ఆదేశానుసారం పని చేయాలని సలహా ఇచ్చారు. నెల్లూరులోని ఇందిరాభవన్ లో మంగళవారం నేదురుమల్లికి ఆత్మీయ సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సోనియాగాంధీ మాటే వేదమన్నారు. నెల్లూరు పార్లమెంటు స్ధానాన్ని తాను ఆశించానని, అయితే సోనియా గాంధీ పిలిచి పార్లమెంటు వద్దు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారన్నారు. అందుకు ఎదురుచెప్పకుండా ఒప్పుకున్నానన్నారు. ఇందిరా కుటుంబానికి ఏజెంటుగా పనిచేయటమే తనకు తెలిసిన విద్య అన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల మన్నలను పొందారని చెప్పారు.












Click it and Unblock the Notifications