ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వంపై మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ స్టూడియోఎన్ టీవీ చానెల్‌కు ఆయుధంగా మారాయి. ఇరవై ఏళ్లు తాము వైయస్ వెంట నడిచామని, అలా నడిచిన తాము వైయస్‌కు వారసులమవుతామా వైయస్ కుటుంబ సభ్యులు వారసులవుతారా అని ఆయన సోమవారం విశాఖపట్నం సభలో అన్నారు. వైయస్ జగన్‌ను తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే అది ఆయనకే ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ హత్యా రాజకీయాలకు వారసత్వం వహిస్తారా అని స్టూడియోఎన్ ప్రశ్నిస్తోంది. అయినా ఇరవై ఏళ్ల వైయస్‌తో కలిసి నడిచిన కిరణ్ కుమార్ రెడ్డి హత్యా రాజకీయాలకే వారసత్వం వహిస్తారనే ముక్తాయింపు ఇచ్చింది. జగన్, కిరణ్‌ల వైరం తెలుగుదేశం పార్టీ నాయకులకు కలిసి వస్తున్నట్లుంది.