అవిశ్వాసం చిక్కుల్లో జగన్: బాబు 'మమతా'స్త్రం

అందుకోసం ఆమె జాతీయస్థాయిలో తనతో కలిసి వచ్చే పార్టీల కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఫైర్ బ్రాండ్‌కు మద్దతు ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ దీనిపై మల్లగుల్లాలు పడుతోంది. ఒకవేళ ప్రభుత్వ పడిపోయే పరిస్థితి ఉండే బిజెపి మమత అవిశ్వాసానికి మద్దతుగా నిలవనుంది. ఈ నెల 22న జరిగే పార్లమెంటు సమావేశాలలో మమత అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు.
ముల్లును ముల్లుతోనే...
ముల్లును ముల్లుతోనే తీయాలనేది నానుడి. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు అదే వైఖరి జగన్ పైన అనుభవిస్తుంది. మమతా బెనర్జీ అవిశ్వాసం పెడితే తాము యూపిఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని టిడిపి ప్రకటించింది. అదే సమయంలో జగన్ పార్టీ వైఖరిని వారు ప్రశ్నిస్తున్నారు. యూపిఏ-2కు మద్దతు పలుకుతారా లేక మమతా బెనర్జీ అవిశ్వాసానికి మద్దతు పలుకుతారా చెప్పాలని టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి సోమవారం ప్రశ్నించారు.
చిక్కుల్లో జగన్!
మమతా బెనర్జీ అవిశ్వాస తీర్మానం వ్యవహారంతో వైయస్ జగన్ చిక్కుల్లో పడ్డారని అంటున్నారు. యూపిఏకి అనుకూలంగా ఓటు వేస్తే ప్రజలు ఆ పార్టీని విశ్వసించే పరిస్థితి ఉండదు. కాంగ్రెసు పార్టీతో చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గత కొంతకాలంగా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ఇలాంటి సమయంలో యూపిఏకి అనుకూలంగా వైయస్సార్ కాంగ్రెసు ఓటు వేస్తే టిడిపి ఎదురు దాడికి దిగడమే కాకుండా.. ప్రజల విశ్వాసాన్ని కూడా ఆ పార్టీ కోల్పోతుంది.
ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో యూపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటు వేసింది. దీంతో ఇప్పటికే కుమ్మక్కు రాజకీయంపై ఆ పార్టీ కొంత పలుచన అయింది. ఇప్పుడు కూడా యూపిఏకి అనుకూలంగా వేస్తే పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉండటం ఖాయమంటున్నారు. మరోవైపు మమత అవిశ్వాసానికి మద్దతుగా, యూపిఏకి వ్యతిరేకంగా ఓటు వేసినా జగన్‌కే కష్టమంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మమతా బెనర్జీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తే కేంద్రం జగన్ పార్టీ ఆస్తులపై విచారణను వేగవంతం చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇన్నాళ్లూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు ఇప్పుడు యూపిఏ-2 విషయానికి వచ్చే సరికి సందిగ్ధంలో పడిందంటున్నారు. మమతా అవిశ్వాస అస్త్రం టిడిపికి బాగా కలిసి వచ్చింది. జగన్ ఎటు ఓటు వేసినా తమకే క్రెడిట్ దక్కుతుందని టిడిపి భావిస్తోంది.












Click it and Unblock the Notifications