వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ జోష్: అతి పెద్ద పార్టీగా తెరాస?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తాజా హెడ్‌లైన్స్ టుడే - సి వోటర్ సర్వేతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శిబిరంలో ఆనందోత్సహాలు వెల్లివిరుస్తున్నాయి. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మంచి జోష్ మీదున్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తెరాస గెలుచుకుంటుందని సర్వే తేల్చింది. తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన తెరాస మిగతా పార్టీలకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకోవడమనేది విచిత్రమైన విషయమే.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెరాసకు 12 లోకసభ స్థానాలు వస్తాయని సర్వే తేల్చింది. ఈ లెక్కన తెరాస అత్యధిక శాసనసభా స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా శాసనసభలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తెరాస వర్గాలు చెప్పుకుంటున్నాయి. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సీట్లను గెలుచుకుంటాయని, తెలంగాణలో ఏకపక్ష ఫలితం వెలువడి తాము అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని తెరాస వర్గాలంటున్నాయి.

రాష్ట్ర శాసనసభలో 294 స్థానాలున్నాయి. దానివల్ల తెరాస 70 - 80 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏకపక్షంగా ఫలితాలు సాధించలేదనే విషయం సర్వే వల్ల అర్థమవుతోందని అంటున్నారు.

సీమాంధ్రలో మూడు పార్టీలో సీట్లను పంచుకుంటాయని, తెలుగుదేశం పార్టీ పూర్తిగా పెకలించుకుని పోలేదని, చెప్పాలంటే దాని పరిస్థితి కాంగ్రెసుకన్నా మెరుగ్గా ఉందని అంచనా వేస్తున్నారు. టిడిపికి 10 లోకసభ స్థానాలు, కాంగ్రెసుకు 7 లోకసభ స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. ఈ లెక్కన టిడిపి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పోటీ గట్టిగానే ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏమైనా, కెసిఆర్ జోష్‌కు అడ్డుకట్ట వేసేవారు లేకుండా పోయారు.

English summary

 The Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao (KCR) is in gappy mood with Headlines today and C - voter survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X