వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిటౌన్‌లో పొలిటికల్ గేమ్: ఒన్లీ 'జగన్'.. నో 'నిర్దోషి'?

By Srinivas
|
Google Oneindia TeluguNews

 For Tollywood, Jagan is not Nirdoshi
2014 ఎన్నికల హడావుడి కేవలం రాజకీయ పార్టీలకే కాకుండా టాలీవుడ్‌కు కూడా పాకిందనే చెప్పవచ్చు. న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని హైలెట్ చేస్తూ ఓ సినిమా రూపొందిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఇటీవల ప్రచార సాధనాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఆయన పార్టీ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో సినీ రంగానికి చెందిన పలువురు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ కుటుంబం కూడా ఆ వరుసలో ఉందని ఇటీవలి వరకు వార్తలు వచ్చాయి. చాలామంది జగన్ పార్టీ టిక్కెట్ నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టం చూపుతున్నారు. అదే సమయంలో జగన్‌ను హైలెట్ చేస్తూ పలు చిత్రాలు రూపొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అందులో 'జగన్ నిర్దోషి' అని సినిమా కూడా ఉంది. ఈ సినిమాను నిర్మాతలు జగన్ కోసమే తీస్తున్నారనే ప్రచారం సాగుతోంది. సూపర్ స్టార్ కృష్ణ బంధువైన శివ హీరోగా ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా పైన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలే కాకుండా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, ఎపి ఫిల్మ్ ఛాంబర్‌లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్‌ను నిర్దోషి అని ఎలా చెప్పగలమని ప్రశ్నించాయి.

దీంతో చర్చోపచర్చల అనంతరం 'జగన్ నిర్దోషి' అనే టైటిల్ నుండి 'నిర్దోషి' అనే పదాన్ని తొలగించేందుకు చిత్ర దర్శక, నిర్మాతలు అంగీకరించారు. సూపర్ స్టార్ కృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సానుభూతిపరుడనే ముద్ర ఉందని అంటున్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో ఓ ఆఫీస్ బేరర్ తెరాస మద్దతుదారుడు. కృష్ణ బంధువు ఒకరు వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుండి జగన్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారట.

అదే సమయంలో ఆఫీస్ బేరర్ మిర్యాలగూడ నుండి తెరాస టిక్కెట్‌తో లోకసభకు పోటీ చేయాలని భావిస్తున్నారట. వారిద్దరి మధ్య విభేదాలు తమ సినిమా పైన ప్రభావం చూపాయని ఆ వర్గాలు ఆవేదన చెందుతున్నాయట. అందరికీ మంచి చేయాలనే ఓ యువకుడిని ఓ అధికారి అక్రమంగా జైలుకు పంపిస్తాడని, ప్రజల మద్దతుతో ఆ యువకుడు జైలు నుండి విడుదలవుతాడని, ఇదే తమ చిత్ర కథ అని, తాము జగన్‌కు మద్దతుగా సినిమాను తీయడం లేదని దర్శకులు చెప్పారు.

దర్శకులు వెంకన్న బాబు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అభిమాని. అయితే ఆయన మాత్రం తాను వైయస్ అభిమానిని అయినప్పటికీ జగన్‌కు మద్దతుగా మాత్రం సినిమాను తీయడం లేదని చెప్పారు. ఈ సినిమా పేరులోని నిర్దోషి టైటిల్‌ను తీసివేసేందుకు అంగీకరించినప్పటికీ అదే టైటిల్ కోసం తాము న్యాయపరంగా పోరాడుతామని ఆయన చెప్పుకొచ్చారు.

English summary
Tollywood has become the latest battleground for political rivalry with sympathisers of YRS Congress and TSR facing off over the title of the controversial Telugu film Jagan starring newcomer Shiva, evergreen actor Krishna’s kin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X