సాక్షి నుంచి సజ్జల ఔట్: జగన్ కార్యదర్శిగా...

Sajjala out of Sakshi, takes party post
హైదరాబాద్: సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ వచ్చిన సజ్జల రామకృష్ణా రెడ్డి ఆ పదవి నుంచి తప్పుకున్నారు. పాత్రికేయుడైన సజ్జల రామకృష్ణా రెడ్డి సాక్షి మీడియాను స్థాపించడంలో దాన్ని నడిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా పనిచేస్తూ వస్తున్నారని చెబుతూ వచ్చారంటారు.

పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవడంలో భాగంగా వైయస్ జగన్ పార్టీ కమిటీలను పునర్వ్యస్థీకరించారు. పార్టీ కోసం సజ్జల రామకృష్ణారెడ్డిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి సాక్షి మీడియా బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఆయన వైవీ సుబ్బారెడ్డితో పాటు వైయస్ జగన్ రాజకీయ కార్యదర్శిగా నియమితులయ్యారు.

పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా తనకు అనుబంధంగా వైయస్ జగన్ ఇద్దరు కార్యదర్శులను నియమించుకున్నారు. వైవీ సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణా రెడ్డి కార్యదర్సి పదవులను నిర్వహిస్తారు. సజ్జల రామకృష్ణా రెడ్డి స్థానంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్‌గా ప్రముఖ పాత్రికేయుడు రామచంద్రమూర్తి బాధ్యతలు స్వీకరించారు.

సజ్జల, వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రెండింటికీ అధ్యక్షుడి కార్యదర్శులుగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి, విడివిడిగా కమిటీలో నాయకులను ఎంపిక చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+