తెలంగాణలో విజయమ్మ లేదా షర్మిల పోటీ?

 Vijayamma or Sharmila from Telangana?
హైదరాబాద్: తాము తెలంగాణలో ఐదు లోకసభ స్థానాలు గెలుచుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తెలంగాణను పూర్తిగా వదిలేసి సమైక్యాంధ్ర నినాదం తీసుకున్న ఆయన పార్టీ తెలంగాణలో సీట్లు ఎలా గెలుచుకుంటుందనేది ఆశ్చర్యం కలిగించిన విషయం. అయితే, తాము గెలుచుకోగలిగే స్థానాలను వైయస్ జగన్ గుర్తించినట్లు చెబుతున్నారు.

దానికితోడు, వైయస్ జగన్ కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జగన్ తల్లి వైయస్ విజయమ్మ గానీ సోదరి వైయస్ షర్మిల గానీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు వైయస్ జగన్ నియోజకవర్గాన్ని కూడా గుర్తించినట్లు చెబుతున్నారు.

సీమాంధ్ర ప్రజలు అధికంగా ఉన్న మల్కాజిగిరి స్థానం నుంచి వారిద్దరిలో ఒకరు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు నిజానికి, మల్కాజిగిరి సీటుపై సీమాంధ్ర నాయకులు పలువురు కన్నేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

మల్కాజిగిరి లోకసభ స్థానంలో 70 శాతం మంది సీమాంధ్ర ప్రజలు ఉన్నట్లు అంచానా. దానికితోడు, 14 లక్షల మంది ఓటర్లలో 50 వేల మంది ముస్లింలున్నారు. అంతేకాకుండా అదే స్థాయిలో రెడ్డి ఓటర్లున్నారని చెబుతున్నారు. దాంతో మల్కాజిగిరి నుంచి తమ కుటుంబ సభ్యుల్లో ఒకరి చేత పోటి చేయించి, తెలంగాణలో అవకాశాలను మెరుగుపరుచుకోవాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+