కిరణ్ రెడ్డిని సీఎం చేయడంతప్పేనన్న రాహుల్‌గాంధీ?

హైదరాబాద్: సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని చేయడం తప్పేనని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాడు పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఆ సమయంలో ఆయన స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. కిరణ్ రెడ్డికి బాధ్యతలు అఫ్పగించడంలో రాహుల్ గాంధీ పాత్ర కూడా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడు తాము తీసుకున్న నిర్ణయం తప్పేనని కాంగ్రెస్ నేతలతో వ్యాఖ్యానించారంటున్నారు.

 Rahul Gandhi responds on Kiran Kumar Reddy

ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. వారు స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవాలంటే ఏం చేయాలనే దాని పైన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన.. కిరణ్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసిన తప్పిదానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు.

కాగా, 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి గెలిచిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రమాదంలో మృతి చెందడంతో.. కొణిజేటి రోశయ్యను సీఎంగా చేశారు. దాదాపు ఏడాది పాటు ఆయన సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత పలు పరిణామాల నేపథ్యంలో కిరణ్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+