డిజిటల్ హెల్: ఆ ఇంటికి 60 కోట్ల ఐపీ అడ్రస్‌లు, ఐదేళ్ల నరకం
వాషింగ్టన్: ఆ ప్రాంతంలో దాదాపు ఏ దొంగతనం జరిగినా, ఆ ఇంటికి వచ్చి పోలీసులు అక్కడ నివాసం ఉండే దంపతులను ప్రశ్నిస్తున్నారు. పోలీసులే కాదు నేర బాధితులు కూడా వారిని బెదిరించిన సందర్భాలు కోకొల్లలు. దాదాపు అయిదేళ్ల పాటు ఆ దంపతులు ఈ బాధలు అనుభవించారు.
ఏం చేయలేక కోర్టుకు వెళ్లారు. దాదాపు ప్రతి కేసు విషయమై ఆ ఇంటికి రావడం వెనుక ఓ కారణం ఉంది. ఆ ఇంటికి ఏకంగా 60 కోట్ల ఐపీ అడ్రస్‌లు ఉన్నాయి. దీంతో వాస్తవాలు వెలుగులోకి చూశాయి.
అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో పొట్విన్ అనే ప్రాంతంలో జేమ్స్, అర్నాల్డ్ దంపతులకు ఇల్లు ఉంది. ఇన్ని సమస్యలకు ఆ ఇంటిని మ్యాక్స్ మైండ్ అనే సంస్థకు అద్దెకు ఇవ్వడం. ఈ ఇల్లు అమెరికా భౌగోళిక కేంద్రానికి సమీపంలో ఉండటంతో మ్యాక్స్ మైండ్ ఐపీ అడ్రస్‌ల కోసం ఈ ఇంటిని ఉపయోగించింది.

ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయిన కంప్యూటర్లు, కంప్యూటర్ నెట్ వర్క్‌లను గుర్తించేందుకు ఐపీ అడ్రస్‌లను ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. ఈ అడ్రస్‌లు ఇళ్లు ఏ ప్రదేశంలో ఉందో చెప్పగలుగుతాయి. కొన్నిసార్లు అస్పష్టమైన సమాచారాన్ని ఇస్తాయి. మ్యాక్స్ మైండ్ దాదాపు 60 కోట్ల ఐపీ అడ్రస్‌లను క్రియేట్ చేసింది. దీంతో వాటిని పొందినవారిలో ఎవరు నేరం చేసినా జేమ్స్, థెరిస్సా దంపతులు ఇబ్బంది పడుతున్నారు.
ఆ 60 కోట్ల ఐపీ అడ్రస్‌లలో దేని నుంచి ఆన్‌లైన్ మోసాలు జరిగినట్లు పోలీసులు గుర్తించినా మొదటి ఆ ఇంటికే వస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఇంటిని చుట్టుముట్టి సోదాలు నిర్వహిస్తున్నారు.స్థానిక పోలీసులు మొదలుకుని ఎఫ్‌బీఐ వరకు నిత్యం అందరూ ఎంతోమంది కేసుల దర్యాప్తు కోసం క్యూ కడుతున్నారు.
ఆన్‌లైన్ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, చిన్నపిల్లలతో పోర్న్ వీడియోలు తీస్తున్నారని, హ్యాకింగ్‌కు పాల్పడ్డారని అంటూ రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా విచారణాధికారులు ఇంటికి వస్తున్నారు. ఐదేళ్లుగా ఇలా గా జరుగుతుండటంతో విసుగు చెందిన ఆ దంపతులు మ్యాక్స్‌మైండ్ సంస్థపై కోర్టులో దావా వేశారు.
ఆ ఇంట్లో అద్దెకి దిగిన తొలి వారంలోనే చోరీకి గురైన ట్రక్కు కోసం వెతికేందుకు అధికారులు వచ్చారని, అప్పటి నుంచి ఐదేళ్లుగా లెక్కలేనంత మంది వచ్చారని, ఫేస్‌బుక్ ఖాతాలను హ్యాక్ చేశారని, ఆన్‌లైన్ మోసాలకు పాల్పడ్డారని, కిడ్నాప్‌కు పాల్పడ్డారని చాలామంది భయపెడుతున్నారని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఆ ఇల్లు ఓ డిజిటల్ హెల్‌గా మారిపోయిందని, దీనికి కారణమైన మ్యాక్స్‌మైండ్ సంస్థ నుంచి 75వేల డాలర్లు పరిహారంగా ఇప్పిచాలని కోర్టుకెక్కారు.
అయితే, అమెరికా భౌగోళిక కేంద్ర బిందువుకు అతి సమీపంలో ఆ ఇల్లు ఉంది. అన్ని ఐపీ అడ్రస్‌లు ఆ ఇంటినే చూపించడానికి అదే ప్రధాన కారణమై ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కేసుపై స్పందించిన మ్యాక్స్‌మైండ్ సంస్థ.. ప్రస్తుతం అన్ని ఐపీ అడ్రస్‌ల డీఫాల్ట్ లొకేషన్లను నడి సముద్రంలోకి మార్చినట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications