గ్రేటర్లో ఒక్క సీటు: కళ్లలో నీళ్లు తిరుగుతాయన్న బాబు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. 93 స్థానాలలో పోటీ చేసిన టిడిపి కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోవడం ఆ పార్టీ వర్గాలకు షాకిచ్చింది. హైదరాబాదులో టిడిపికి మంచి పట్టు ఉంది.
అందుకు గత సార్వత్రిక ఎన్నికలే నిదర్శనం. 2014 ఎన్నికల్లో టిడిపి - బిజెపి మిత్రపక్షాలు మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో 14 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేశారు. అయితే, నగరంలోని చాలామంది టిడిపి ఎమ్మెల్యేలు తెరాసలోకి జంప్ కావడం ముంచింది.

హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో గొప్పగా నిలిపామని, అభివృద్ధిని చేశామని చెప్పుకుంటూ ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించి, గ్రేటర్‌లో కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితం చేసిన విషయంపై విలేకరులు.. చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు.
దీనికి చంద్రబాబు మాట్లాడాతు.. చేసిన అభివృద్ధి నేను ఫలితం ఆశించి చేసినది కాదని, ఫలితం ఆశిస్తేనే బాధ కలుగుతుందని, నేను బాధ పడటం లేదని ఫర్వాలేదని, తన బాధ్యతలు నేను నిర్వర్తించానని, తనకు ఓట్లు వేస్తారా? ప్రజలు నాతోనే ఉంటారా? అని ఆలోచిస్తూ అభివృద్ధికి పాటు పడలేదని, టిడిపి ఓడిపోవడాన్ని విశ్లేషిస్తూ... ఇంటర్నెట్‌లో ఒక వ్యక్తి రాసిన లేఖ చదివితే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయన్నారు.












Click it and Unblock the Notifications