వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై పోలీసుల హీరో కెసిఆర్ అట!

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవలి కాలంలో పోలీసుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీసుకున్న నిర్ణయం ఇపుడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హాట్ టాపిక్‌గా మారింది. ట్రాఫిక్ డ్యూటీలో, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉద్యోగాలు చేసే ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేక అలవెన్స్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారు.

ట్రాఫిక్ సిబ్బంది కోసం ఇచ్చే అలవెన్సులతో రాష్ట్ర ఖజానాపై నెలకు దాదాపు రూ.25 కోట్లు, ఏటా దాదాపు రూ.300 కోట్ల మేర భారం పడుతున్నప్పటికీ భరించేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశంలో చర్చించి అనంతరం స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ నిర్ణయం త్వరలో ఉత్తర్వుల రూపంలో అమల్లోకి రానున్నది.

KCR is the hero for Mumbai police

తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ పొల్యూషన్ అలవెన్స్ నిర్ణయాన్ని తీసుకోవడం అన్ని నగరాల్లో ట్రాఫిక్ సిబ్బందిలో ఆశలు మోజులు వేశాయి. దాదాపు 6000 ట్రాఫిక్ సిబ్బందికి మేలు చేసేలా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ నేపథ్యంలో తాజాగా ముంబైలో పొల్యూషన్ అలవెన్స్‌కు ప్రతిపాదన పెట్టారు. తెలంగాణ ప్రభుత్వంలాగే తమకు కూడా 30 శాతం ట్రాఫిక్ అలవెన్స్ ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ అంశంపై బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలని నగరానికి చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్నాడట.

English summary
It is said that Mumbai police are considering Telangana CM K chandrasekhar rao as their hero
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X