• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటాను మహిళలు నిలదీశారు!.. అనంతలో ఆయన్ను అడ్డుకుని..

|
Google Oneindia TeluguNews

అనంతపురం: జన్మభూమి కార్యక్రమంతో జనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీకి అక్కడక్కడ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నెరవేర్చని హామిలపై.. ముందుకు కదలని పనులపై జనం నిలదీసి అడుగుతుండటంతో ఒకింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇదే అనుభవం ఎదురైంది. మంగళవారం అనంతపురం జిల్లా హిందూపురం నియోజవర్గంలో గంటా పర్యటించారు. అక్కడినుంచి కడప జిల్లా వెళ్తుండగా కదిరి నియోజకవర్గ పరిధిలోని తలుపుల మండలం సిద్దుకూరుపల్లి వద్ద అక్కడి మహిళలంతా కలిసి గంటా కాన్వాయ్ ను అడ్డగించినట్టు తెలుస్తోంది.

తాగునీటి సమస్యపై నిలదీశారు:

తాగునీటి సమస్యపై నిలదీశారు:

తాగు నీటి సమస్యను పరిష్కరించాలని సిద్దుకూరుపల్లి మహిళలంతా మంత్రి గంటాను నిలదీసి అడిగారు. ఇదే సమస్యపై స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక నేతలెవరూ తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి ఎదుట మహిళలంతా ఖాళీ బిందెలతో తమ నిరసన తెలియజేశారు.

ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి కూడా:

ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి కూడా:

అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి కూడా జన్మభూమి సెగ తగిలింది. ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్‌ శ్రీదేవి దంపతులను స్థానికులు నిలదీశారు. తమ డివిజన్ పట్ల నాయకులు వివక్ష చూపుతున్నారని వాపోయారు.

పింఛన్లు, ఇళ్ల మంజూరులో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. ఒకే పింఛన్‌ మంజూరు చేయడమంటే వివక్ష కాక మరేమవతుందని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సానుకూలంగా స్పందించారు. పారదర్శకతతోనే తాము పనిచేస్తున్నామని, ఏ డివిజన్ ను చిన్నచూపు చూడబోమని ఆయన స్థానికులకు హామి ఇచ్చారు.

జన్మభూమిని బహిష్కరించిన గ్రామస్తులు:

జన్మభూమిని బహిష్కరించిన గ్రామస్తులు:

కదిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్‌పీకుంట మండలం పీ.కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన జన్మభూమిని అక్కడి స్థానికులు బహిష్కరించారు. సోలార్ పరిహారం అందజేసేంతవరకు ఇక్కడ జన్మభూమి సభలు పెట్టవద్దని హెచ్చరించారు. ఇక అదే మండలపరిధిలోని దిగువపల్లిలోను జన్మభూమి సభకు ఎదురుదెబ్బ తగలింది.

గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సభకు హాజరైన నేతలను, అధికారులను వారు నిలదీసి అడిగారు.

చంద్రన్న సంక్రాంతి కానుకలు:

చంద్రన్న సంక్రాంతి కానుకలు:

హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తన స్వగ్రామం గోరంట్లలో జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంత్రికొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే బీకే.పార్థసారథి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
అర్హులకు చంద్రన్న సంక్రాంతి కానుకలు, రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. గర్భవతులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేసి వారిని మంత్రి ఆశీర్వదించారు. సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు.

English summary
Siddhukurupally village people are questioned Ganta Srinivasarao for solving water problems
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X