వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతారా?'

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓడిపోతారా.. అంటే అవుననే అంటున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎందుకు ఓడిపోతారో కూడా చెప్పార

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓడిపోతారా.. అంటే అవుననే అంటున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎందుకు ఓడిపోతారో కూడా చెప్పారు.

రేవంత్ రెడ్డి ఆంధ్రా తొత్తులా మారాడని, వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తలసాని వ్యాఖ్యానించారు. తలసాని ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కోస్గి పట్టణంలో గొర్రెల పంపిణీ పథకంపై నిర్వహించిన నియోజకవర్గ అవగాహన సదస్సుకు హాజరయ్యారు.

Talasani says Revanth Reddy will defeat in Kodangal

ఈ సందర్భంగా మాట్లాడారు. కొడంగల్‌ ఎమ్మెల్యే ఆంధ్ర పార్టీ తొత్తుగా వ్యవహరిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని మండిపడ్డారు.

ఆ ఎమ్మెల్యే టీవీల ముందు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని, వచ్చేఎన్నికల్లో కొడంగల్‌ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు.

బిజెపి నేత నాగం జనార్దన రెడ్డి గొర్రెల ఎంపికలో అవినితి జరుగుతుందని అంటున్నారని, ఇప్పటి వరకు గొర్రెలనే కొనుగోలు చేయకుంటే అవినీతి ఎలా జరుగుతుందో చెప్పాలన్నారు. 3న సీఎం కేసిఆర్‌ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.

English summary
Minister Talasani Srinivas Yadav on said that TDP MLA Revanth Reddy will defeat in Kodangal in next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X