కేసీఆర్‌కు షాక్: మమతా బెనర్జీ వైపే చంద్రబాబు మొగ్గు
Recommended Video

హైదరాబాదు: బిజెపితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు తెగదెంపులు చేసుకుంటారనే ప్రచారం ముమ్మరమైంది. ఈ స్థితిలో ఆయన జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించడానికి కూడా సిద్దపడినట్లు సమాచారం.
ఇప్పటికే థర్డ్ ఫ్రంట్ తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఎటు వైపు ఉంటారనే చర్చ సాగుతోంది. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్ వైపు ఉంటారా, మమతా బెనర్జీ వైపు ఉంటారా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది.

అటు వైపే చంద్రబాబు
కేసిఆర్ ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్, మమతా బెనర్జీ తలపెట్టిన థర్డ్ ఫ్రంట్ ఒక్కటేనా, కాదా అనే సందిగ్దత నెలకొని ఉంది. ఈ స్థితిలో చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ వైపు ఉండదలుచుకుంటే ఎవరి వైపు ఉంటారనేది ప్రశ్న. ఆయన కేసీఆర్ వైపు కాకుండా మమతా బెనర్జీ వైపు ఉంటారని అంటున్నారు. దానికి కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

థర్డ్ ఫ్రంట్‌పై మాట్లాడని చంద్రబాబు
థర్డ్ ఫ్రంట్ ఆలోచనపై పలువురు నాయకులు ప్రతిస్పందిస్తున్నారు. అయితే, ఈ విషయంపై చంద్రబాబు ఇప్పటి వరకు ఏమ మాట్లాడలేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తూ, భవిష్యత్తులో అనుసరించాల్సిన వైఖరిపై సమాలోచనలు జరుపుతూ ఆయన బిజీగా ఉన్నారు. కాగా, థర్డ్ ఫ్రంట్‌పై చంద్రబాబుతో మాట్లాడారా అని అడిగితే ఇంకా లేదని కేసీఆర్ చెప్పారు.

ఇరుువురి మధ్య విభేదాలు...
చంద్రబాబుకు, కేసీఆర్‌కు మధ్య పరిష్కారం కావాల్సిన వివాదాలు ఇంకా చాలా ఉన్నాయి. దీంతో కేసీఆర్‌తో చేతులు కలపడం వల్ల చంద్రబాబుకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కెసిఆర్‌తో కలిసి నడిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. దాంతో కెసిఆర్ ఫ్రంట్‌తో కన్నా మమతా బెనర్జీ ఫ్రంట్‌తో కలిసి నడవడం మంచిదని తెలుగుదేశం వర్గాలంటున్నారు.

విభజన వివాదాలు అలాే...
9, 10 షెడ్యూల్‌లో ఉన్న సంస్థలు, ఢిల్లీలోని ఎపి భవన్ వివాదాలు పరిష్కారం కాలేదు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన వాటా లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికపై ఆస్తుల పంపకం జరగాలని ఎపి అంటోంది. ఈ సమస్యలు పరిష్కారం కాకుండా కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చంద్రబాబుకు సాధ్యం కాదని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications