ఆలూ క్యాప్సికం కర్రీ.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..
ఆలూ, క్యాప్సికం కాంబినేషన్ లో కర్రీ చాలా బాగుంటుంది. ఈ కూర అన్నం, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ పదార్థాలతో.. సింపుల్ గానే ఈ వంటకాన్ని చేసుకోవచ్చు. మరి ఈ ఆలూ క్యాప్సికం మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం ఏంటి..?
ఆలూ క్యాప్సికం మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. ఆలూ నాలుగు, క్యాప్సికం నాలుగు, ఉల్లిగడ్డలు రెండు, పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు, టమాటోలు నాలుగు, నూనె నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ లు, పల్లీలు నాలుగు టీ స్పూన్ లు, నువ్వులు, జీలకర్ర ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్ లు, ధనియాల పొడి, గరం మసాలా తగినంత, ఉప్పు సరిపడా, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర తరుగు తీసుకోవాలి.
క్యాప్సికం ఆలూ కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా బంగాళాదుంపలను తొక్క తీసి కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాంతోపాటు క్యాప్సికం, ఉల్లిపాయ, టమాటోలను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. అందులో పల్లీలు వేసి తక్కువ మంటమీద గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. అవి వేగిన అనంతరం అందులో తెల్ల నువ్వులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండింగ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. నూనే పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో అల్లం పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి. ఇప్పుడు అందులో ఆలూ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆ మిశ్రమంలో క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలోనే టమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు తగినంత వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమం ఉడికిన తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమం వేయాలి. ఇప్పుడు గ్రేవీకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. అలా ఉడకనివ్వాలి. కర్రీ చక్కగా ఉడుకుతున్న క్రమంలో చివరగా కొత్తిమీర తరుగు వేస్తే సరి. ఘుమఘుమలాడే ఆలూ క్యాప్సికం కర్రీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications