మిగిలిపోయిన అన్నంతో నోరూరించే ఆలూ రైస్.. ఇలా చేస్తే అదిరిపోద్ది!
మిగిలిపోయిన అన్నంతో సులభంగాను, తక్కువ సమయంలోనూ తయారుచేసుకోగలిగే ఆలూ రైస్ అనేక వంటకాల్లో ప్రత్యేకమైనది. సాధారణంగా అందరికీ నచ్చే వంటకాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ, ఈ ఆలూ రైస్ నోరూరించే రుచితో ప్రతీఒక్కరికీ నచ్చేవిధంగా ఉంటుంది.ఈ ఆలూ రైస్ ఒకప్పుడు మన ఇళ్ళలో రాత్రి అన్నం మిగిలిపోతే తయారుచేసేవారు. అసలు ఈ ఆలూ రైస్ తయారీ ఎలా? ఎలా చేస్తే ఇది మరింత రుచికరంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం.
ఆలూ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
అన్నం - ఒక కప్పు
ఉడికించిన ఆలు ముక్కలు - 150 గ్రాములు
ఉల్లిపాయ - 1 కట్ చేసి పెట్టుకున్నవి
టమాటాలు - 2 కట్ చేసుకున్న ముక్కలు
పుదీనా - 1 కప్పు
కొత్తిమీర - 1 కప్పు ,
వెల్లుల్లి అల్లం పేస్ట్ - 1 స్పూన్,
పచ్చిమిర్చి - 3-4,
ఉప్పు - తగినంత
పెరుగు - 3 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 1/2 చెక్క
జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్
కారం- 1 టీస్పూన్

తయారీ విధానం
ముందుగా కట్ చేసుకున్న బంగాళా దుంపలను ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు వేసి దోరగా వేయించాలి.తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, మరియు ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. అందులో కొత్తిమీర, పుదీనా, నిమ్మరసంతో కలిసిన పేస్ట్ ను వేసుకోవాలి.
ఇలా చేస్తే ఆలూ రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది
అందులో మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా ఉడికించిన అన్నం మరియు గరం మసాలా వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే రుచికరమైన ఆలూ రైస్ రెడీ అయ్యింది. దీనినిరైతాతో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి అయినా, లంచ్ బాక్స్ లోకి అయినా, ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తే అప్పటికప్పుడు చేసి పెట్టటానికి అయినా ఇది చాలా బాగుంటుంది.













Click it and Unblock the Notifications