ఆంధ్రా స్టైల్ కాకరకాయ కారం.. ఇలా చేసి వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అద్భుతః!
ప్రతిరోజు మనం తినే ఆహారంలో కూరల పాత్ర ఎంతైనా ఉంటుంది. కూరలు మాత్రమే కాదు డిఫరెంట్ గా మనం తయారు చేసుకునే కారంపొడులు కూడా మనకు ఆరోగ్యాన్ని, నోటికి మంచి రుచిని అందిస్తాయి. ప్రస్తుతం మనం ఈరోజు చాలా ప్రత్యేకంగా చెప్పుకునే ఆంధ్ర స్టైల్ కాకరకాయ కారం పొడి ఏ విధంగా తయారు చేస్తారు అనేది తెలుసుకుందాం.
కాకరకాయ కారం పొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
కాకర కాయలు- అరకిలో
ఉప్పు- రెండు స్పూన్లు రుచికి తగినంత
ఎండు మిరపకాయలు- 15
ధనియాలు- రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర- రెండు టేబుల్ స్పూన్
మినప్పప్పు - రెండు టేబుల్ స్పూన్లు
శనగపప్పు- రెండు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు- 15
చింతపండు- పెద్ద నిమ్మకాయంత
పసుపు - అర స్పూను
నూనె- 100 గ్రాములు

తయారీ విధానం
ముందుగా కాకరకాయలు ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు వేసి పదినిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత బాగా గట్టిగా పిండి నీరు తీసివేయాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలలో చేదు తగ్గుతుంది. ఇక కాకరకాయ పొడి తయారు చేసుకోవడానికి పాన్లో కొద్దిగా నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
కారంపొడి ఇలాతయారు చేసుకోవాలి
ఆ తర్వాత అదే పాన్లో ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చివరగా పసుపు చింతపండు వేసి, ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత పాన్ లో నూనె పోసి కాకరకాయ ముక్కలు వేసి మీడియం మంట పైన క్రిస్పీగా వేయించుకోవాలి.
కాకరకాయ కారప్పొడి రెడీ
వేయించిన కాకరకాయలు తగినంత ఉప్పు వేసి, మనం అప్పటికే మిక్సీలో గ్రైండ్ చేసుకున్న కారప్పొడి ని జత చేయాలి. బాగా కలిపి సన్నని మంటపైన మూడు నుండి నాలుగు నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. అంతే కాకరకాయ కారప్పొడి రెడీ అవుతుంది. ఇది వేడివేడి అన్నంలో, పప్పు, నెయ్యితో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications