ఆంధ్రా స్టైల్ వంకాయ రోటిపచ్చడి .. ఇలా చేస్తే మామూలుగుండదు!

మనం తినే ఆహారంలో కూరలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కూరలు మాత్రమే కాదు రోటిపచ్చళ్ళు కూడా అంతే ప్రధాన స్థానం ఉంటుంది. చాలామంది కూరల కంటే రోటిపచ్చళ్ళు ఇష్టంగా తింటారు. రోటి పచ్చళ్ళు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తాయి. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ లో వంకాయ రోటిపచ్చడి ఏవిధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. వంకాయ రోటి పచ్చడితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. వాటిని తెలుసుకుందాం.

వంకాయ రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు

వంకాయలు- పావు కిలో

పచ్చిమిరపకాయలు- 15 కారాన్ని బట్టి

ఉప్పు- తగినంత

చింతపండు- చిన్న నిమ్మకాయంత

నూనె- రెండు టేబుల్ స్పూన్లు

జీలకర్ర -రెండు టేబుల్ స్పూన్లు

కరివేపాకు- రెండు రెమ్మలు

వెల్లుల్లి- 8 రెబ్బలు

ఎండుమిరపకాయలు- 2

పోపు గింజలు -1 స్పూన్

Andhra style Vankaya Chutney Easy Home made healthy vankaya Roti pachadi Recipe

తయారీ విధానం

వంకాయలను ముందుగా ముక్కలుగా కట్ చేసి, పచ్చిమిరపకాయల తొడిమలు తీసి , స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేడి చేసి అందులో పచ్చిమిరపకాయలు వంకాయ ముక్కలను వేసి, అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసి మగ్గించాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. రోట్లో పచ్చిమిరపకాయలు వంకాయ ముక్కలను ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు. కరివేపాకు వేసి పచ్చడిగా నూరుకోవాలి.

వంకాయ పచ్చడితో ఆరోగ్య ప్రయోజనాలు

దీనిని నేరుగా గాని లేదా పోపు చేసుకుని గాని తినొచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి కాంబినేషన్ తో ఈ వంకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వంకాయ పచ్చడి తో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియకు దోహదం చేస్తుంది.

వంకాయ పచ్చడి తింటే జరిగే మేలు ఇదే

వంకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వంకాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి వంకాయ మంచి ఆహారంగా పనిచేస్తుంది. చర్మానికి, జుట్టుకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. శరీరం నుండి టాక్సిన్స్ ను బయటకు పంపడానికి దోహదం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+