ఎండాకాలం చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా?
చాలామంది వేసవికాలం ప్రారంభం కావటంతో స్నానం చేయడానికి చన్నీళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అసలు స్నానం చేయటానికి చన్నీళ్లు మంచిదా? వేడి నీళ్లు మంచిదా? అనే తర్జనభర్జన చాలా మంది పడుతూ ఉంటారు. ఇక వేసవికాలంలో రాత్రి వేళల్లో చాలామంది వేడి నుండి ఉపశమనం పొందడానికి చన్నీళ్ల స్నానం చేస్తారు. అసలు చన్నీటి స్నానం చేయడం మంచిదా కాదా? చన్నీటి స్నానం చేస్తే ఎటువంటి ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
చన్నీళ్ళ స్నానం చేయటం మంచిదా.. కాదా?
చన్నీళ్ళ స్నానం మంచిదే. రాత్రిపూట చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరం చిరాకు నుండి ఉపశమనం పొందుతుంది. రిలాక్స్ అవుతుంది. చన్నీళ్ళ స్నానం నిద్రను బాగా ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజు చన్నీళ్ళతో స్నానం చేయడంవల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. చన్నీళ్ల స్నానం మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని మరింత పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుతుంది.

చన్నీళ్ళ స్నానంతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు
చన్నీళ్ళ స్నానం చేయటం వలన ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చన్నీళ్ళ స్నానంతో నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. అంతేకాదు హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది. చన్నీళ్ళ స్నానం తో రక్తపోటు తగ్గుతుంది. చన్నీళ్ళ స్నానం చేస్తే చర్మ రంధ్రాలు బిగుతుగా మారతాయి. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.చన్నీళ్ళ స్నానం గుండె జబ్బులు వంటి ప్రమాదాలు రాకుండా కాపాడుతుంది.
గుండె, చర్మ ఆరోగ్యానికి చన్నీళ్ళ స్నానం మంచిదేనా
చన్నీళ్ళ స్నానం గుండె ఆరోగ్యానికి మంచిది. చన్నీటి స్నానం మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చన్నీళ్ళ స్నానం చేసేవారిలో చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. వేసవిలో రాత్రిపూట చన్నీళ్ళ స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గి శరీరం చల్లబడి హాయిగా ఉంటుంది. అయితే చన్నీళ్లతో స్నానం చేయాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
చన్నీళ్ళ స్నానం చెయ్యాలనుకుంటే వీరు జాగ్రత్త
రాత్రి సమయంలో చన్నీళ్ళతో స్నానం చేస్తే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త. అంతేకాదు కొంత మందిలో రాత్రిపూట చన్నీళ్ళతో తలస్నానం చేస్తే తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి చన్నీళ్లతో తల స్నానం చేయకుండా ఉంటేనే మంచిది. ఇక గుండె సమస్యలు ఉన్నవారు రాత్రిపూట చన్నీళ్లు స్నానం చేయకపోవడమే మంచిదని సలహా.
ఎండాకాలం ఇలా చన్నీళ్ళ స్నానం అసలే చెయ్యొద్దు
ఇక ఎండాకాలంలో చన్నీళ్ళ స్నానం చేయటం మంచిది అని సూచన.అయితే బాగా ఎండలో తిరిగి వచ్చి వెంటనే చన్నీళ్ళతో స్నానం చేయటం ఏ మాత్రం మంచిది కాదు. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత చన్నీళ్ళ స్నానం చెయ్యాలి. కనుక ఈ సీజన్ లో చన్నీళ్ళ స్నానం చేసేవారు తప్పక ఈ విషయాలు తెలుసుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications