ఉడికించిన గుడ్లు Vs ఆమ్లెట్‌లు: బరువు తగ్గడానికి ఏది మంచిది?

కోడిగుడ్లు భారతీయ ఆహారంలో చాలా ప్రధానమైనవిగా చెబుతారు. కోడిగుడ్లు ప్రోటీన్ సమృద్ధిగా ఉండడంవల్ల మన శరీరానికి కావలసిన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అయితే చాలామంది గుడ్లను రకరకాలుగా ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఉడకబెట్టిన గుడ్లను తింటే, మరి కొంతమంది ఆమ్లెట్లు వేసుకుని తింటుంటారు. రెండింటికీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్ ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది మంచిది అనే విషయాన్ని ప్రస్తుతం తెలుసుకుందాం.

గుడ్లలో ఫుల్ పోషకాలు

కోడిగుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు బరువు తగ్గడానికి, కండరాల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్ అన్న అంశానికి వస్తే ఉడకబెట్టిన గుడ్లు చాలా సులభంగా తయారు చేయబడతాయి. ఇవి ఎక్కువ పోషకాలను నిలుపుకుంటాయి.

Boiled Eggs Vs Omelettes Which Is Better For Weight Loss

ఉడకబెట్టిన గుడ్డులో క్యాలరీలు ఇలా, ఆమ్లెట్ లో ఇలా

ఒక పెద్ద ఉడకబెట్టిన గుడ్డు లో సుమారు 78 క్యాలరీలు 6 గ్రాముల ప్రోటీన్ ఐదు గ్రాముల కొవ్వు ఉంటుంది. దీంట్లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్లు తక్కువ తీసుకోవాలనుకునే వారికి ప్రయోజనాలను ఇస్తుంది. ఇక ఆమ్లెట్ విషయానికి వస్తే రెండు గుడ్లతో చేసిన ఆమ్లెట్లో సుమారు 140 క్యాలరీలు, 10 గ్రాముల ప్రోటీన్ 10 గ్రాముల కొవ్వు ఉంటుంది.

ఉడకబెట్టిన గుడ్డు లో ఆమ్లెట్ తో పోలిస్తే తక్కువ క్యాలరీలు, కొవ్వు

ఇందులో కూరగాయలను చేర్చి ఆమ్లెట్ వేస్తే ఫైబర్ కంటెంట్ ను కూడా పెంచుకోవచ్చు కానీ ముఖ్యంగా ఇది క్యాలరీలను పెంచకుండా మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బరువు తగ్గాలని భావించే వారికి ఈ రెండు ఎంపికలు మంచివి అయినప్పటికీ ఉడకబెట్టిన గుడ్డు లో ఆమ్లెట్ తో పోలిస్తే తక్కువ క్యాలరీలు, కొవ్వు ఉంటాయి. అవి క్యాలరీల సంఖ్యను పెంచే అదనపు పదార్థాలు లేకుండా ప్రోటీన్ పెంపును అందిస్తాయి.

ఆమ్లెట్, ఉడకబెట్టిన గుడ్డులో ఇదే బెస్ట్

ఆమ్లెట్లో మనం నూనెను ఉపయోగించడం వల్ల ఇందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక ఆమ్లెట్ కంటే ఉడకబెట్టిన గుడ్డే శ్రేయస్కరమని చాలామంది పోషకాహార నిపుణులు చెబుతారు. అయితే ఆమ్లెట్లో క్యారెట్, పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా రకరకాల పదార్థాలను జోడించి ఆమ్లెట్ తయారు చేసుకుంటే ఇది కూడా మన శరీరానికి కావాల్సిన మంచి పోషకాలను అందిస్తుంది.

ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్ ల ఎంపిక దీనిపై ఆధారపడి ఉంటుంది

ఉడకబెట్టిన గుడ్డు మరియు ఆమ్లెట్ ల మధ్య ఎంపిక వ్యక్తిగత అభిరుచులు మరియు ఆహార లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. రెండు ఎంపికలు సమతుల్య ఆహారంలో భాగమే అయినప్పటికీ బరువు తగ్గడానికి ఉడకబెట్టిన గుడ్డే మంచిదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+