డయాబెటిక్ పేషెంట్లు పల్లీలు తింటున్నారా? ఒక్కసారి ఇవి తెలుసుకోండి.
పల్లీలు (Groundnuts/Peanuts) ఆరోగ్యానికి పలు విధాలుగా ప్రయోజనకరమైనవి, ఇవి ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఆహారం ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అయితే డయాబెటిక్ పేషెంట్లకు అవి తినడం మంచిదేనా అనేది చాలామందిని కలవరపెడుతుంది. అయితే, డయాబెటిక్ పేషెంట్లు పల్లీలను తింటే, కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరం ఉంది.
పల్లీల పోషక విలువలు
పల్లీలలో అధికంగా మోనోసాచురేటెడ్ , పాలిసాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పల్లీలలో లభించే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిలకడగా ఉంచడంలో సహకరిస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కూడా తక్కువగా ఉండడం వల్ల పల్లీలు రక్తంలో చక్కర స్థాయిలపై అధిక ప్రభావం చూపవు.

డయాబెటిక్ పేషెంట్స్‌కు కలిగే ప్రయోజనాలు
పల్లీలలో ఉండే ప్రోటీన్ , కొవ్వులు శరీరానికి దీర్ఘకాల ఎలర్జీ ఇస్తాయి, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. వీటిల్లో ఉన్న మంచి కొవ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హృదయానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పల్లీల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.
హానికర అంశాలు
పల్లీలు అధికంగా తింటే కాలరీలు , కొవ్వు అధికమై శరీర బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇది రక్తంలో చక్కర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. ఉప్పు లేదా చక్కెర వంటివి జోడించి పల్లీలు తినడం వలన డయాబెటిక్ పేషెంట్ల ఆరోగ్యానికి ప్రమాదం కలగవచ్చు. కొంతమంది పల్లీలకు అలర్జీ ఉండే అవకాశం ఉంటుంది, కనుక తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.
ఎలా తినాలి?
పల్లీలను మితంగా తినడం మంచిది. రోజుకు 30-50 గ్రాముల పల్లీలు సరిపోతాయి. ఉప్పు లేకుండా పచ్చి లేదా స్వచ్ఛమైన రీతిలో వేయించిన పల్లీలను తీసుకోవాలి. పల్లీలను న్యూట్రీషియస్ స్నాక్స్‌గా పండ్లు, సలాడ్, లేదా చపాతీతో కలిపి తీసుకోవచ్చు.
డయాబెటిక్ పేషెంట్లు పల్లీలను మితంగా, సరైన రీతిలో తీసుకుంటే అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఎలాంటి కొత్త ఆహారపు అలవాట్లు ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.












Click it and Unblock the Notifications