ప్రియుడి కోసం.. భర్త నరాలలోకి సిరెంజీతో హార్పిక్ ఇంజక్షన్ ఎక్కించి హతమార్చిన ఇల్లాలు

ఇటీవల కాలంలో భర్తలను హతమారుస్తున్న భార్యల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. చిన్న చిన్న కారణాలకే భర్తలను కాటికి పంపిస్తున్న మహిళలు సమాజాన్ని షాక్ కు గురి చేస్తున్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు అనేక దారుణ ఘటనల వెనుక కీలక కారణంగా మారుతున్నాయి. ఇక తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ ప్రియుడి మోజులో భర్తను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

బాత్ రూమ్ లు క్లీన్ చేసే హార్పిక్ లిక్విడ్ ఎక్కించి భర్త హత్య

ప్రియుడి మోజులో పడిన ఒక ఇల్లాలు భర్తకు పీకల దాకా మందు తాగించి, ఆపై మద్యం మత్తులో ఉన్న భర్తకు బాత్ రూమ్ లు క్లీన్ చేసే హార్పిక్ లిక్విడ్ ను సిరెంజ్ తో ఇంజెక్షన్ చేసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. టాయిలెట్ క్లీనర్ అయిన హార్పిక్ లిక్విడ్ ను భర్త శరీరంలోకి ఎక్కించి హతమార్చింది. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలలోకి వెళితే..

wife killed husband with lover in nizamabad by injecting toilet cleaner harpic liquid into his veins

భార్యా భర్తల మధ్య విబేధాలు.. ప్రియుడి కోసం భార్య క్రిమినల్ ప్లాన్

నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో ప్రశాంత్ సంధ్య కాపురం ఉంటున్నారు. అయితే భార్యాభర్తల మధ్య ఇటీవల కాలంలో విబేధాలు వచ్చాయి. గత కొంతకాలంగా సంధ్య వేరే వ్యక్తితో చనువుగా ఉంటుంది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈక్రమంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా, భర్తను తమకు అడ్డు తప్పించాలని సంధ్య ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది.

ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఇల్లాలు

పథకం ప్రకారం భర్త ప్రశాంత్ కు అతిగా మద్యం తాగించి, అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్నాక ప్రియుడిని ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి మద్యం ,మత్తులో ఉన్న ప్రశాంత్ పై తీవ్రంగా దాడి చేసి భవనంపై నుండి క్రిందికి తోసేశారు. అయినప్పటికీ అతను ప్రాణాలు కోల్పోలేదు. దీంతో అతడిని చంపాలని భావించిన భార్య సంధ్య ఇంట్లో ఉన్న హార్పిక్ లిక్విడ్ ను సిరంజీలోకి తీసుకుని నేరుగా భర్త నరాల్లోకి ఎక్కించింది.

సంధ్య తీరు అనుమానం కలిగించటంతో పోలీసులకు ఫిర్యాదు

దీంతో అతను కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత భర్త మృతిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది సంధ్య, అయితే ప్రశాంత్ కుటుంబ సభ్యులకు సంధ్య తీరు అనుమానం కలిగించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సంధ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.

ఆ కాలేజీలలో చేరుతున్నారా.. డిగ్రీలో చేరే విద్యార్థులకు తీవ్ర హెచ్చరిక!
ఆ కాలేజీలలో చేరుతున్నారా.. డిగ్రీలో చేరే విద్యార్థులకు తీవ్ర హెచ్చరిక!

భార్య, ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలింపు

దీంతో సంధ్యతో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. భర్తకు హార్పిక్ లిక్విడ్ ఎక్కించి హతమార్చిన సంధ్య మానసిక స్థితి ఇటీవల కాలంలో స్త్రీలలో పెరుగుతున్న క్రిమినల్ నేచర్ ను స్పష్టంగా చూపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+