అర్ధరాత్రి గదిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన టాలీవుడ్ నటులు.. వైరల్ వీడియో
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాధారణ కుటుంబాలతోపాటు సెలబ్రిటీ ఫ్యామిలీస్ లోనూ ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాలతో తమ నిండు కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. వారి పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంలోకి నెడుతున్నారు. ఇటీవల ఫోక్ సాంగ్స్ తో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ లు.. అయితే వీరిద్దరూ నిన్న అర్ధరాత్రి ఓ ఇంట్లోని రూమ్ లో అడ్డంగా దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
భార్యకు పట్టుబడ్డ ఫోక్ సాంగ్ ఆర్టిస్టులు
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026
ఫోక్ సాంగ్స్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ను నిన్న అర్థరాత్రి సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఈశ్వర్ సాయి భార్య
ఇటీవల ప్రమీల ఫోక్ సాంగ్‌లో ప్రధాన నటీనటులుగా నటించిన మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి pic.twitter.com/FNmtrKUA7E
ఈశ్వర్.. నిన్న అర్ధరాత్రి మాధురితో కలిసి ఓ గదిలో ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కెరీర్ లో జానపద గీతాల ద్వారా వీళ్లు మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ జోడీ ఇప్పుడు ఇలా ఓ రూమ్ లో అర్ధరాత్రి అడ్డంగా దొరికిపోవడంతో ఫోక్ సింగర్స్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. సన్న సన్న బియ్యమే.. రాతిరి రాతిరిలో.. సిటీ చీర.. కళ్యాణి జరరావే వంటి సాంగ్స్ లో వీరు కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ప్రమీల అనే పేరుతో ఓ ఫోక్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో మాధురి రాథోడ్.. ఈశ్వర్ సాయి లీడ్ రోల్ లో నటించారు.

ఇటీవల ప్రమీల అనే పేరుతో ఒక ఫోక్ సాంగ్ విడుదలైంది. ఈ పాట సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ఈ పాటలో మాధురి రాథోడ్.. ఈశ్వర్ సాయి లీడ్ రోల్ లో నటించారు. ఈ పాట సామాజిక మాధ్యమాల్లో రికార్డు స్థాయి వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ లు అడ్డంగా దొరికారు. ఈశ్వర్ సాయి తన భార్యను ఇటీవలికాలంలో దూరం పెట్టడంతో అతనిపై అనుమానం పెంచుకుంది. ఈ నేపథ్యంలో అతనిపై నిఘా పెట్టింది. ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ తో వ్యవహారం సాగిస్తున్నట్టు తేలింది. ఈ మేరకు వేములవాడలోని ఓ హోటల్ రూమ్ లో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ లను అడ్డంగా పట్టుకుంది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రస్తుతం పోలీసులు.. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై వేములవాడ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications