ఏపీలో పింఛన్ దారులకు అలర్ట్..! బ్యాంకుల సమ్మె కారణంగా ఈసారి..!

ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు (NTR Bharosa pension) అక్టోబర్ 1న ఇచ్చే పెన్షన్లలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెలాఖరులో మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె కారణంగా ఈ మార్పు చోటు చేసుకోనుంది. బ్యాంకుల సమ్మెతో పెన్షన్ల కోసం నిధుల్ని బ్యాంకుల నుంచి డ్రా చేయడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. దీంతో ఎప్పటిలాగే ఈసారి ఉదయం పెన్షన్ల పంపిణీ జరిగే అవకాశం లేదు. ఈ మేరకు స్వల్ప ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సెప్టెంబర్ 26వ తేదీ శనివారం బ్యాంకు సెలవు కావడం, అలాగే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్న నేపథ్యంలో పింఛనుదారులకు ఎలాంటి అవస్థలు కలగకుండా ప్రభుత్వం ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన‌ట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 1వ తేదీ ఉదయమే పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును విత్‌డ్రా చేసుకునేలా బ్యాంకులను అందుబాటులో ఉంచాలని SLBC (రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి)కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

AP Pensioners Alert NTR Bharosa pension Disbursal Schedule Changed Due to Bank Strike

స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు సిబ్బంది అక్టోబర్ 1వ తేదీ ఉదయం బ్యాంకుల నుండి నగదును విత్‌డ్రా చేసి.. అదే రోజు మ‌ధ్యాహ్నం నుంచే నేరుగా ఫించ‌న్‌దారుల ఇళ్ల‌వ‌ద్ద‌కే వెళ్లి పింఛ‌న్లు పంపిణీ చేస్తార‌ని మంత్రి కొండ‌ప‌ల్లి స్ప‌ష్టం చేశారు. బ్యాంకు సెలవులు, సమ్మె కారణాల వల్ల పింఛన్ల పంపిణీ తేదీ, విధానంలో జరిగిన ఈ మార్పులను పింఛనుదారులందరూ గమనించి, పంపిణీ సిబ్బందికి మరియు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు.

రాష్ట్రంలో 61.80 లక్షల మంది పింఛనుదారులకు అక్టోబ‌ర్ 1న‌ పింఛన్లు అంద‌జేసేందుకు ప్ర‌భుత్వం రూ.2,692.34 కోట్ల విడుదల చేసింద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు. విడుదల చేసే మొత్తం నిధుల్లో రూ.2,675.63 కోట్లను సంబంధిత స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు పింఛను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తార‌ని.. రూ.16.65 కోట్లను పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా జమ చేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, SNA SPARSH విధానం ద్వారా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో నేరుగా DBT ద్వారా పింఛన్లను జమ చేసే ప్రక్రియను విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్న‌ట్టు మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం ఈ మండలంలోని NSAP పింఛనుదారుల ఖాతాల్లో రూ.0.06 కోట్లు నేరుగా జమ కానున్న‌ట్టు మంత్రి కొండ‌ప‌ల్లి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+