కేబినెట్ నిర్ణయాలు: మరో హామీ అమలు, కొత్త ఉద్యోగాలు - ఈ నెల పెన్షన్లలో మార్పు.!!
ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరో హామీ అమలు దిశగా ఆమోదం తెలిపింది. ఎల్‌నినోపై చర్చించారు. ఎల్‌నినో ప్రభావంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. ఏ సమస్య ఎక్కడ తలెత్తినా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. కొత్తగా ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపారు. ప్రధాని పర్యటన కారణంగా ఆగస్టు 1న పెన్షన్ల పంపిణీలో మార్పు చేసారు.
చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించే 'నేతన్న భరోసా' పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ. 25,000 ఆర్థిక సాయం అందనుంది. జాతీయ చేనేత దినోత్సమైన ఆగస్టు 7న ఈ పథకాన్ని అమలు చేయను న్నారు. అదే విధంగా ప్రధాని మోదీ ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంకు వస్తున్న వేళ భారీ ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. ప్రధాని పర్యటన కారణంగా ఆగస్టు 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్లను ఒక రోజు ముందుగానే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయం లో రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం పైనా చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా 3,648 ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

మంత్రులకు చంద్రబాబు దిశా నిర్దేశం
కాగా, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. ఏ సమస్య ఎక్కడ తలెత్తినా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకోవాలన్నారు. క్షేత్రస్ధాయికి వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేవరకు ఇన్ఛార్జ్ మంత్రులదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. భోగాపురం ప్రధాని పర్యటన వివరాలు మంత్రులకు వివరించిన సీఎం.. ఘనంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మెగా డీఎస్సీ పైన, ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలతో ముడిపెట్టాలని వైసిపి ప్రయత్నిస్తుందన్నారు. వైసీపీ నేతల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు. లేని వివాదాలు సృష్టించాలని వైసిపి ప్రయత్నం చేస్తూనే ఉంటుందన్నారు. అలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత తీసుకోవాలని.. ప్రో యాక్టివ్ గా మంత్రులు ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు. వైసీపీ. చేస్తున్న. విమర్శలకు మంత్రులు సరైన కౌంటర్లు ఇవ్వడం లేదని.. రైతుల సమస్యలపై ప్రతిపక్షాల విమర్శలకు మంత్రు లు సరిగా స్పందించ లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎప్పటికప్పుడు మంత్రులు కౌంటర్లు ఇవ్వాలని సూచించారు.












Click it and Unblock the Notifications