ముంబై ఇండియన్స్‌లో భారీ మార్పు: నీతా అంబానీ బిగ్ డెసిషన్!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ మహిళల జట్టు మేనేజ్మెంట్‌లో సంచలన మార్పులు చేసింది. జట్టు కొత్త హెడ్ కోచ్ గా ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెట్ కోచ్ ల్యూక్ విలియమ్స్‌ను నియమించినట్లు ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది. కేవలం ఒక్క సీజన్ మాత్రమే బాధ్యతలు నిర్వర్తించి పదవి నుంచి తప్పుకున్న లీసా కీట్లీ స్థానంలో 46 ఏళ్ల ల్యూక్ విలియమ్స్ ఈ పదవి చేపట్టనున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీగా పేరు గాంచిన ముంబై జట్టును తిరిగి విజయతీరాలకు చేర్చే లక్ష్యంతో ఫ్రాంచైజీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్ హ్యాట్రిక్.. జోరు మామూలుగా లేదు!
భారత్ హ్యాట్రిక్.. జోరు మామూలుగా లేదు!

ల్యూక్ విలియమ్స్‌కు మహిళల టీ20 లీగ్స్‌లో కోచ్ గా మంచి రికార్డు ఉంది. 2024 డబ్ల్యూపీఎల్ సీజన్లో ఆర్సీబీ మహిళల జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరించిన ఆయన.. ఆర్సీబీకి తొలి చారిత్రాత్మక టైటిల్ ను అందించడంలో కీలక పాత్ర పోషించారు. అంతే కాకుండా ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టును రెండు సార్లు రన్నరప్‌గా నిలబెట్టడంతో పాటు 2022-23లో వారికి మొదటి ట్రోఫీని సాధించిపెట్టారు. ద హండ్రెడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా, ఇంగ్లాండ్ మహిళల జాతీయ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన అపారమైన అనుభవం ఆయనకు ఉంది.

Mumbai Indians Make Big Change Luke Williams Named Head Coach for Womens Premier League 2027

ముంబై ఇండియన్స్ జట్టుకు 2026 డబ్ల్యూపీఎల్ సీజన్ తీవ్ర నిరాశను మిగిల్చింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఈ జట్టు లీగ్ దశలో కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికే పరిమితమైంది. గతంలో రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో యాజమాన్యం కోచింగ్ విభాగాన్ని మార్చడంపై దృష్టిసారించింది. ఈ సందర్భంగా ల్యూక్ విలియమ్స్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో భాగమవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, జట్టులోని మేటి క్రీడాకారులతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు.

Hurun India Rich List 2026: హైదరాబాద్ లో టాప్ 7 రిచెస్ట్ పర్సన్స్ వీళ్లే..
Hurun India Rich List 2026: హైదరాబాద్ లో టాప్ 7 రిచెస్ట్ పర్సన్స్ వీళ్లే..

ముంబై ఇండియన్స్ అధినేత్రి నీతా అంబానీ కొత్త హెడ్ కోచ్ గా ల్యూక్ విలియమ్స్ రాకను స్వాగతించారు. విలియమ్స్ టీ20 ఫార్మాట్లో అద్భుత విజయాలు సాధించిన కోచ్ అని.. ఆయనకు మహిళల క్రికెట్ పై ఉన్న అవగాహన, ఆటగాళ్లను తీర్చిదిద్దే నైపుణ్యం జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం, ల్యూక్ విలియమ్స్ మార్గదర్శకత్వంలో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు రాబోయే డబ్ల్యూపీఎల్ 2027 సీజన్లో మళ్లీ ఛాంపియన్లుగా అవతరిస్తుందని నీతా అంబానీ ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+