Amrutha Pranay Case: ప్రణయ్ హత్య కేసులో సంచలనం.. చర్లపల్లి జైలులో నిందితుడు మృతి

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో సరిగ్గా 8 సంవత్సరాల క్రితం అంటే 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 4 (నాలుగో నిందితుడు) గా ఉన్న అబ్దుల్‌ బారీ గుండెపోటుతో మృతిచెందాడు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో అతడు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే గురువారం ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో అధికారులు వెంటనే ఆయన్ని సికింద్రాబాద్‌ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలోనే ఉంచారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో నల్గొండలోని ప్యారసాభగ్ కాలనీకి చెందిన అబ్దుల్‌ బారీ చర్లపల్లి జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2025 మార్చి నెలలో నల్గొండ కోర్టు అతనితో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. వారిలో ఎంఏ నజీమ్ ఆటో డ్రైవర్, శ్రావణ్ మారుతి రావు తమ్ముడు, సముద్రాల శివ, మహమ్మద్ అస్గర్ అలీ, మహమ్మద్ అబ్దుల్ కరీం లు ఉన్నారు. వీరితో పాటు కాంట్రాక్ట్ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మకు మరణశిక్ష విధించింది. అయితే గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో బారీని గతంలో అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే ఆ కేసులో బారీ నిర్దోషిగా విడుదలయ్యాడు.

ఇక మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద 2018 సెప్టెంబర్‌ 14వ తేదీన ప్రణయ్ ను అతి కిరాతకంగా హత్య చేశాడు కాంట్రాక్ట్ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మ. అమృతను ప్రణయ్‌ కులాంతర వివాహం చేసుకున్న క్రమంలో ఆమె తండ్రి మారుతీరావు.. ప్రణయ్‌ ను హత్య చేయించినట్లు కోర్టు తేల్చింది. ఇక పోలీస్‌ చార్జ్‌ షీట్‌ లోని వివరాల ప్రకారం అబ్దుల్‌ కరీం, అబ్దుల్‌ బారీ, అస్ఘర్‌ అలీలు కాంట్రాక్ట్‌ కిల్లర్‌ సుభాష్‌ కుమార్‌ శర్మ సాయంతో ప్రణయ్‌ ను హత్య చేశారు. ఇందుకు కోటి రూపాయల వరకూ డీల్‌ కుదిరినట్లు సమాచారం. భార్య అమృతతో కలిసి ఆసుపత్రి నుండి బయటకు వస్తున్న ప్రణయ్‌ ను శర్మ వెంబడించి కత్తి దాడి చేసి హత్య చేసిన దృశ్యాలు అప్పట్లో సంచలనంగా మారాయి.

abdulbari 2018 Pranay murder case in Miryalaguda listed as Accused No 4 has died of a heart attack

ఈ కేసు విచారణలో ఉండగానే అమృత తండ్రి మారుతి రావు 2020 మార్చి 8న హైదరాబాద్‌ లోని ఖైరతాబాద్‌ లో గెస్ట్‌ హౌస్‌ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన నిందితులపై విచారణ కొనసాగించి కోర్టు గత ఏడాది మార్చిలో తుది తీర్పు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+