నాని 'ది ప్యారడైజ్' మూవీ ఓటీటీలోకి ఎప్పుడంటే..?
నేచురల్ స్టార్ నాని- దర్శకుడు శ్రీకాంతో ఓదెల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'ది ప్యారడైజ్' ప్రస్తుతం థియేటర్లలో రచ్చ చేస్తోంది. ఇవాళే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయింది. సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. కొంతమంది బాగుందని.. మరికొంతమంది బాలేదని అంటున్నారు. కానీ థియేటర్లలో మాత్రం టికెట్స్ భారీగా సేల్ అవుతున్నాయి. బుక్ మై షో వెబ్ సైట్ లో గంటకు 20 వేల టికెట్స్ అమ్ముడవుతున్నాయి. టాక్ తో సంబంధం లేకుండా నాని ఫ్యాన్స్ సినిమాను ఎంజాయ్ చేస్తున్నాయి. ఆయా షేర్, ఏషనాగుల లాంటి పాటలతో రిలీజ్ కు ముందే ప్యారడైజ్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఇదివరకు వచ్చిన దసరా మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న రెండో మూవీ ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా సినిమాను వినూత్నంగా ప్రొమోట్ చేసింది చిత్ర యూనిట్.
ప్యారడైజ్ మూవీలో నాని పవర్ ఫుల్ యాక్టింగ్, ఫస్టాఫ్, విజువల్స్ అలాగే పాటలు బాగున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక కథ, స్క్రీన్ ప్లే లో లోపాలు ఉన్నట్లు సమాచారం. ఎమోషన్స్ తేలిపోయాయని టాక్ నడుస్తోంది. అలాగే మితిమీరిన వైలెన్స్ కూడా సినిమాకు మైనస్ అయినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్యారడైజ్ మూవీకి ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. నాని యాక్షన్ ఎపిసోడ్స్ కు, మదర్-సన్ ఎమోషన్ కు, సాంగ్స్ కు రెస్పాన్స్ బాగా వస్తోంది. థియేటర్లలో వాటికి మంచి అప్లాజ్ కనిపిస్తుంది. అటు సినిమా ఇంపాక్ట్, ఇటు బుకింగ్స్ చూస్తుంటే ఫస్ట్ డే నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ నంబర్ పెట్టేట్టు కనిపిస్తోంది. ఇప్పటి ట్రెండ్స్ ప్రకారం డే 1 కచ్చితంగా 60 కోట్ల గ్రాస్ తో ప్యారడైజ్ మూవీ రికార్డు సృష్టించనున్నట్లు సమాచారం.

ఇక నాని ప్యారడైజ్ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ. 65 కోట్లకు డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఓటీటీ డీల్ నాని కెరీర్ లో హైయెస్ట్ అని స్పష్టం అవుతోంది. ఇక సినిమా విడుదలైన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి రావాలనే రూల్ తో డీల్ కుదిరింది. దీన్ని బట్టి చూస్తే అక్టోబర్ చివరివారం నాటికి ది ప్యారడైజ్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఈ విషయంపై నెట్ ఫ్లిక్స్ సంస్థ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.












Click it and Unblock the Notifications
