Harvest Moon 2026: ఈ వీకెండ్‌లో ఆకాశంలో అద్భుతం.. ప్రత్యేకతలు ఇవే!

Harvest Moon 2026: ఈ వారాంతంలో ఖగోళ ప్రేమికులకు ఓ అద్భుతమైన దృశ్యం అందుబాటులోకి రానుంది. శరదృతువు విషువత్తు ముగిసిన వెంటనే వచ్చే సెప్టెంబర్ పౌర్ణమిని 'హార్వెస్ట్ మూన్'(పంట కోత చంద్రుడు) అని పిలుస్తారు. ఈ ఏడాది హార్వెస్ట్ మూన్ శనివారం(సెప్టెంబర్ 26) నాడు తన గరిష్ట ప్రకాశాన్ని సంతరించుకోనుంది. సూర్యాస్తమయం అయిన వెంటనే ఆకాశంలో ప్రత్యక్షమయ్యే ఈ పూర్ణ చంద్రుడు, సాధారణ రోజుల కంటే ఎక్కువ వెలుతురును, పెద్ద పరిమాణాన్ని కలిగి ఉంటాడు.

విమానాలు ఎక్కువశాతం తెలుపు రంగే ఎందుకు ఉంటాయి? తప్పక తెలుసుకోవాల్సిందే!
విమానాలు ఎక్కువశాతం తెలుపు రంగే ఎందుకు ఉంటాయి? తప్పక తెలుసుకోవాల్సిందే!

ఉత్తరార్ధగోళంలో శరదృతువు విషువత్తుకి అత్యంత సమీపంలో వచ్చే పౌర్ణమికి హార్వెస్ట్ మూన్ అని పేరు వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22న విషువత్తు సంభవించింది. ప్రాచీన కాలంలో విద్యుత్ దీపాలు లేని రోజుల్లో, రైతులు చీకటి పడిన తర్వాత కూడా తమ పంటలను కోసుకోవడానికి ఈ పౌర్ణమి వెన్నెల ఎంతో ఉపయోగపడేది. సాయంత్రం వేళల్లో నిరంతరం ప్రకాశవంతమైన వెలుగును అందించే ఈ చంద్రుడిని అందుకే 'హార్వెస్ట్ మూన్' అని పిలవడం ఆనవాయితీగా మారింది.

Harvest Moon 2026 Rare Full Moon to Light Up the Sky on September 26 why this full moon is special

సాధారణంగా ప్రతిరోజూ చంద్రోదయం ముందు రోజు కంటే దాదాపు 50 నిమిషాలు ఆలస్యంగా జరుగుతుంది. కానీ హార్వెస్ట్ మూన్ సమయంలో ఈ తేడా చాలా తక్కువగా ఉంటుంది. అమెరికాలో ప్రతి రాత్రి కేవలం 25 నుంచి 30 నిమిషాలు, కెనడా, యూరప్ దేశాలలో 10 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే చంద్రుడు ఉదయిస్తాడు. దీనివల్ల వరుసగా కొన్ని రోజుల పాటు సాయంత్రం వేళల్లో ఆకాశం ప్రకాశ‌వంతంగా కనిపిస్తుంది. అలాగే రేలీ స్కాటరింగ్ ప్రభావం వల్ల చంద్రోదయం సమయంలో చంద్రుడు వెచ్చని నారింజ లేదా బంగారు రంగు ఛాయలో దర్శనమిస్తాడు.

NO UPI Day: ఆ రోజు దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులు బంద్ ..! వ్యాపారుల నిర్ణయం..!
NO UPI Day: ఆ రోజు దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులు బంద్ ..! వ్యాపారుల నిర్ణయం..!

ఖగోళ సైంటిస్టుల ప్రకారం.. ఇండియాలో ఈ హార్వెస్ట్ మూన్ సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి 10.19 గంటలకు గరిష్టస్థాయికి చేరుకుంటుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించడానికి సెప్టెంబర్ 25(శుక్రవారం) నుంచి సెప్టెంబర్ 27(ఆదివారం) వరకు రాత్రులు అనుకూలంగా ఉంటాయి. 'మూన్ ఇల్యూజన్'(చంద్ర భ్రమ) కారణంగా క్షితిజ సమాంతరంగా ఉదయించే సమయంలో చంద్రుడు పరిమాణంలో చాలా పెద్దదిగా కనిపిస్తాడు. ఈ పౌర్ణమి తర్వాత వచ్చే తదుపరి పౌర్ణమిని 'హంటర్ మూన్' అని పిలుస్తారు. ఇది అక్టోబక్ 26న రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+