తాతను దారుణంగా మర్డర్ చేయించిన 13 ఏళ్ల బాలిక.. వీడియో కాల్ లో హత్యను చూస్తూ..!

యువత రాను రాను అడ్డదారులు తొక్కుతున్నారు. చదువులు మానేసి లవ్, డ్రగ్స్, మద్యం అంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డబ్బు కోసం కన్నతల్లిదండ్రులను కూడా చంపేసేంత రాక్షసంగా మారుతున్నారు. తాజాగా కేరళలో ఇలాంటి ఓ షాకింగ్ ఘటన జరిగింది. కంటికి రెప్పలా చూసుకుంటున్న తాతనే కిరాతకంగా హతమార్చింది ఓ మైనర్ బాలిక. వినడానికి షాకింగ్ గానే ఉన్నా ఇది నిజం. తన స్నేహితులతో కలిసి తాతను చంపించింది. ఆ భయానక దృశ్యాలను వీడియో కాల్ లో చూస్తూ రాక్షసానందం పొందింది. తాత వద్ద ఉన్న డబ్బు, ఫోన్ కోసమే ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. తన 17 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ కు బైక్ కొనివ్వడం కోసం ఆ బాలిక ఈ దారుణానికి పాల్పడినట్లు స్పష్టం అవుతోంది. ఈ ఘటన కేరళలో సంచలనంగా మారింది. రాను రాను యువత ఎలా మారుతున్నారనేది ఈ ఘటన సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

ఈ దారుణమైన ఘటన ఆగస్టు 15 న రాత్రి జరిగింది. ఆ సమయంలో ఇంట్లో వృద్ధుడు (67) ఒంటరిగా ఉన్నాడు. అంతకుముందు బాధితుడి చిన్న కుమార్తె ప్రసవం కోసం సమీపంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేరింది. ఇక ఆయన భార్య తోడుగా వెళ్లడంతో రూమ్ లో ఒంటరిగా వృద్ధుడు ఉన్నాడు. ఇదే అవకాశం అనుకున్న 13 ఏళ్ల బాలిక తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి తాతను హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేసింది. బాలిక వీడియో కాల్ లో ఆ ఇంట్లోకి ఎలా వెళ్లాలో తెలిపింది. అలా బాత్ రూమ్ వెంటిలేటర్ ద్వారా వృద్ధుడి రూమ్ లోకి వెళ్లారు మైనర్ లు. బెడ్ పై ఒంటరిగా పడుకుని ఉన్న వృద్ధుడి కాళ్లు చేతులు కట్టేశారు. ఆ తర్వాత నోట్లో గుడ్డలు కుక్కి, తలను గోడకేసి కొట్టారు. అలా ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ దారుణమైన దృశ్యాలను ఆ మనవరాలు వీడియో కాల్‌ లో లైవ్‌ లోనే చూసింది.

ఈ దారుణాన్ని ఆ మనవరాలు వీడియో కాల్‌లో లైవ్‌గా చూసింది. హత్య చేశాక ఆ నిందితులు ఇంట్లోని 4.5 తులాల బంగారంతో అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఇక ఆగస్టు 16 న అంటే హత్య జరిగిన మరుసటిరోజున బాలిక సాధారణంగానే ప్రవర్తించింది. అలా ఆ రోజంతా ఎలాంటి భయం, ఆందోళన లేకుండా సరదాగా గడిపింది. ఆగస్టు 17న తాత తలుపులు తీయడం లేదని.. మద్యం సేవించి నిద్రపోయాడేమోనని స్థానికులకు వివరించింది. దాంతో స్థానికులు తలుపులు తీసి చూసేసరికి ఆ వృద్ధుడు శవమై కనిపించాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే బాలిక మాత్రం ఎలాంటి అనుమానం రాకుండా స్కూల్ కు వెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Kerala Shocking incident 13 year girl plots grandfather murder watches the killing over video call

ఇక వృద్ధుడి మృతదేహాన్ని సమీపంలోని మార్చురీకి తీసుకెళ్లారు. అదే హాస్పిటల్ లో మృతుడి చిన్న కుమార్తె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భార్య, భర్త చివరి చూపు కోసం ప్రసూతి వార్డు నుంచి నేరుగా మోర్చరీకి రావడం అందరికీ కన్నీళ్లు తెప్పించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మనవరాలే నిందితురాలు అని తేల్చారు. బాలికకు కొత్త మొబైల్ ఫోన్ అలాగే ఆమె స్నేహితుడికి బైక్ కొనుగోలు చేయడానికి డబ్బు అవసరం కావడం ప్రధాన కారణంగా విచారణలో తేలింది. ఇక ఈ కేసులో నిందితులంతా మైనర్లు కావడంతో వారిని పోలీసులు అబ్జర్వేషన్ హోమ్‌ కు తరలించారు. నిందితులను అడల్ట్స్‌ గా పరిగణించి విచారించేలా జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతి కోరతామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+