కొత్త బార్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లో వీరికే కేటాయింపు..!!
తెలంగాణలో కొత్త బార్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 41 కొత్త బార్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ అయింది. అధికంగా హైదరాబాద్ ప్రాంతంలో వీటిని ఖరారు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ ఏర్పాటుకు వీలుగా ఎక్సైజ్ శాఖ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లలో మార్గదర్శకాలు ఖరారు చేసింది. ప్రాంతాల వారీగా ఫీజులను నిర్ధారించింది. ఈ సారి బార్ల కోసం పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో బార్ లైసెన్స్‌ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 41 బార్ లైసెన్స్‌లను నోటిఫై చేసినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఒక్కో దరఖాస్తుకు రూ.1 లక్ష దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు 2026 అక్టోబర్ 12 చివరి తేదీగా ప్రకటించారు. గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటుగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR)లో అత్యధికంగా 14 బార్‌లను నోటిఫై చేశారు. ఈ ప్రాంతానికి BET స్లాబ్‌లను వర్తింపజేశారు. మొత్తం 41 బార్‌లలో అత్యధిక సంఖ్య హైదరాబాద్ కోర్ జనాభా ఆధారంగా స్లాబ్ రేటును రూ.44 లక్షలుగా నిర్ణయించారు. ఇతర ప్రాంతాల్లో రూ.30 లక్షలు, రూ.42 లక్షల స్లాబ్‌లను వర్తింపజేశారు. మొత్తం 41 బార్‌లలో అత్యధిక సంఖ్య హైదరాబాద్ TCUR పరిధిలోనే ఉన్నాయి. జిల్లాల వారీగానూ అధికారులు కొత్త బార్ల లెక్కలను విడుదల చేసారు.

ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలు
కొత్త బార్ల దరఖాస్తులకు అర్హతలను ఖరారు చేసింది. ఈ సారి తెలంగాణలో గ్రేటర్ తో పాటుగా వరుసగా ఎన్నికల సీజన్ ఉండటంతో విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన అర్హతల మేరకు దరఖాస్తుదారులు నిర్ణీత నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించాలి. లైసెన్స్‌కు సంబంధించిన అర్హతలు, షరతులు, దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలను తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారిక వెబ్‌సైట్ tgbcl.telangana.gov.inలో పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
