ఫస్ట్ రోజు డిజాస్టర్ టాక్.. మూడో రోజు బ్లాక్ బస్టర్ టాక్.. 'ప్యారడైజ్' మూవీ సంచలనం..
నేచురల్ స్టార్ నాని- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన 'ది ప్యారడైజ్' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు నమోదు చేస్తోంది. సెప్టెంబర్ 23 న రాత్రి ఈ మూవీకి ప్రీమియర్స్ పడగా నెగెటివ్ టాక్ వచ్చింది. అయితే సెప్టెంబర్ 24 సినిమా రిలీజ్ రోజు మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. రోజు రోజుకూ ప్యారడైజ్ మూవీ టాక్ మరింత మెరుగవుతోంది. దాంతో కలెక్షన్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్యారడైజ్ మూవీ విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 136 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ ను సైతం విడుదల చేసింది. ఓ సినిమా ఫస్ట్ నెగెటివ్ టాక్ తో స్టార్ట్ అయి ఆ తర్వాత హిట్ టాక్ తెచ్చుకోవడం ఈ రోజుల్లో ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఇంతటి మిక్స్ డ్ టాక్ తోనూ నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించిన సినిమాగా ఇప్పటికే ప్యారడైజ్ మూవీ రికార్డు సృష్టించింది. ఇప్పుడు మూడు రోజులకే ఈ భారీ వసూళ్లతో తన సత్తా చాటుతోంది. మరో వారం రోజుల వరకూ ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది.
ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ప్యారడైజ్ సినిమాకు స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. తెలంగాణ నేపథ్యం, కేసీఆర్ సీన్స్, తెలంగాణ పాటలు ఉండటంతో నైజాంలో సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ గురువారం రిలీజ్ కాగా మూడో రోజు సుమారు రూ. 22 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా త్వరలోనే రూ. 150 కోట్ల గ్రాస్ మార్క్‌కు చేరువయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇక బుకింగ్స్ జోరు చూస్తుంటే సోమవారం కూడా ఈ మూవీకి భారీగానే వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక వచ్చే వారంలో ప్యారడైజ్ మూవీ ఇదే జోరును కొనసాగిస్తుందా..? లేక వసూళ్లలో గణనీయమైన డ్రాప్ కనిపిస్తుందా..? అనేది తేలాల్సి ఉంది.

ఇక ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఆయనకు ఇది రెండో సినిమా.. తొలి సినిమా దసరా కూడా నానితోనే చేశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్యారడైజ్ మూవీలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. అలాగే 'కలెక్షన్ కింగ్' మోహన్ బాబు శక్తివంతమైన విలన్ పాత్రలో నటించారు. ఇక సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.












Click it and Unblock the Notifications
