రక్తసిక్తమైన బార్.. భీకర కాల్పుల్లో 27 మంది మృతి

ప్రపంచంలోనే అత్యధిక నేరాలు జరిగే దేశాలలో ఒకటైన దక్షిణాఫ్రికా మరోసారి రక్తమోడింది. ఆ దేశంలోని రెండు ప్రధాన నగరాల సమీపంలో జరిగిన వేర్వేరు సామూహిక కాల్పుల ఘటనలు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ ప్రాంతాల్లో జరిగిన ఈ దారుణ కాండలో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుసగా జరుగుతున్న ఈ హింసాత్మక ఘటనలు ఆ దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

బార్‌లో బీభత్సం.. 17 మంది మృతి

జోహన్నెస్‌బర్గ్ నగరానికి నైరుతి దిశలో ఉన్న వెడెలా టౌన్‌షిప్‌లోని ఒక బార్‌లో శనివారం రాత్రి ఘోర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఏకే-47 రైఫిల్స్, పిస్టళ్లతో వచ్చిన ఎనిమిది మంది దుండగులు ఒక్కసారిగా బార్‌పై పడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ హేచ్యువైన దాడిలో అక్కడికక్కడే 17 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Mass Shootings In South Africa Leave At Least 27 Dead Across Two Separate Attacks Near Major Cities
Video: పాక్‌ ఆర్మీ ఆఫీసర్ దాష్టీకం. క్యాంపస్‌లో విద్యార్థులపై కాల్పులు
Video: పాక్‌ ఆర్మీ ఆఫీసర్ దాష్టీకం. క్యాంపస్‌లో విద్యార్థులపై కాల్పులు

కేప్‌టౌన్ సమీపంలో మరో దాడి.. 10 మంది బలి

ఈ ఘటన మరువకముందే కేప్‌టౌన్ సమీపంలోని ల్వాండ్లే ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక మరో దారుణం జరిగింది. ఒక స్టోర్ వద్ద జరిగిన సామూహిక కాల్పుల్లో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.

బర్త్ డే కేక్ ముఖానికి పూశారని.. ముగ్గురిని కాల్చి చంపిన వైనం !
బర్త్ డే కేక్ ముఖానికి పూశారని.. ముగ్గురిని కాల్చి చంపిన వైనం !

వరుస కాల్పులతో వణికిపోతున్న దేశం

కొద్ది రోజుల క్రితం తూర్పు తీర నగరమైన డర్బన్ సమీపంలో జరిగిన హౌస్ పార్టీలో ముగ్గురు దుండగులు జరిపిన కాల్పుల్లో గర్భిణీతో సహా 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందే ఇప్పుడు తాజాగా మరో రెండు ప్రాంతాల్లో ఇటువంటి ఘోర కృత్యాలు జరగడం కలకలం రేపింది. దక్షిణాఫ్రికాలో నేరాల రేటు ఎప్పుడూ ఎక్కువగా ఉండేదే అయినప్పటికీ, కేవలం ఒక్క వారం వ్యవధిలో ఇలా వరుస సామూహిక కాల్పులు జరగడం అక్కడి భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+