దశాబ్దాల సమస్యకు పరిష్కారం- ఆ భూముల క్రమబద్దీకరణకు ఆదేశాలు..!!

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు భూముల చుట్టూ తిరుగుతున్నాయి. పెండింగ్ భూ సమస్యల పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ మధ్య కాలంలో 22ఏ భూముల వ్యవహారంలో రిలీఫ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఇప్పుడు ULC పెండింగ్‌ దరఖాస్తుల పైనా స్పష్టత ఇచ్చింది. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న భూముల సమస్యల పరిష్కారం దిశగా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం భూముల వివాదాల పై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ULC పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. ప్రజల భూ సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. GO 455, 456, 747, 92 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి.. అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఇందుకోసం Memo No.48062 జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. 2016లోనే దీనికి సంబంధించిన GO జారీ చేసినప్పటికీ గత ప్రభుత్వం దానిని అమలు చేయలేదని పేర్కొన్నారు.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన, భారీ డిమాండ్ తో..!!
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన, భారీ డిమాండ్ తో..!!
telangana-govt-moves-to-resolve-pending-land-issues-orders-ulc-case-regularization

ప్రభుత్వం తాజా ఆదేశాలతో

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అర్హత కలిగిన ULC కేసులను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా 22-A భూ సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇప్పటికే GO 118, GO 76లకు అనుగుణంగా కీలక ఉత్తర్వులు జారీ చేశామని, 22-A జాబితాలో ఉన్నప్పటికీ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి కల్పించినట్లు తెలిపారు. తాజాగా ULC పెండింగ్ దరఖాస్తులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో భూ సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడిందన్నారు. మిగిలిన 22-A సమస్యలను కూడా ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+