ఎన్టీఆర్ ఇంట తీవ్ర విషాదం.. కన్నీటి వీడ్కోలు..ఎమోషనల్ పోస్ట్ వైరల్..

యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ కు ఇటీవల సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్‌ లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు సర్జరీ నిర్వహించారు. అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాను ప్రాణంగా చూసుకునే పెంపుడు కుక్క 'బఘీరా' కన్నుమూసింది.

గత నాలుగేళ్లుగా ఎన్టీఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయిన బఘీరా మృతి పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. తన జీవితంలో ఓ స్నేహితుడిగా వచ్చి.. అలా తమ కుటుంబ సభ్యుడిగా మారిపోయిన బఘీరాకు ఎన్టీఆర్ కన్నీటి వీడ్కోలు తెలిపారు. నిన్ను చాలా ప్రేమించాను.. ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను.. అని ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. అంతేకాక బఘీరా జ్ఞాపకార్థం ఓ మొక్కను కూడా నాటారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

NTR post on death of his dog Junior NTR s emotional post a tearful farewell to his pet dog Bagheera

బఘీరా మృతి నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు.. సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కష్టకాలంలో ఎన్టీఆర్ కు ధైర్యం చెప్పే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు సర్జరీ కావడంతో షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్టీఆర్ లీడ్ రోల్ లో డ్రగ్ మాఫియా, యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ లుగర్ అనే పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ ​గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11 న విడుదల కానుంది. ఈ మూవీతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో గాడ్ ఆఫ్ వార్ అనే మైథలాజికల్ మూవీ కూడా ఎన్టీఆర్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+