పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్ ఇచ్చినప్పుడు భారత రాయబారి రియాక్షన్ ఏదైతే ఉందో.. !!
ఐక్యరాజ్యసమితి 81వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావడంతో పాటు ఈ రెండు దేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం అమలు విషయంలో భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ప్రసంగం మొత్తం కూడా దాదాపుగా ఉద్రిక్తతలను మరింత పెంచేలా సాగిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఆపరేషన్ సింధూర్ ను పరోక్షంగా ప్రస్తావించారు షెహబాజ్ షరీఫ్. భారత్ నుండి ఎదురైన సైనిక సవాళ్లను ఎదుర్కొనడానికి ఐక్యరాజ్యసమితి ఛార్టర్ ప్రకారం తమకు లభించిన ఆత్మరక్షణ హక్కును వినియోగించుకున్నట్లు షరీఫ్ పేర్కొన్నారు. తమ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ నాయకత్వంలో తమ సైన్యం శత్రువులకు గట్టి బుద్ధి చెప్పిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకోకుంటే దక్షిణాసియాలో అణు యుద్ధ ముప్పు సంభవించేదని, ఆయన జోక్యం వల్లే కోట్లాది మంది ప్రాణాలు నిలిచాయని వాదించారు.

తమ సైన్యం శత్రువులకు ఎప్పటికీ మరువలేని పాఠం నేర్పిందంటూ షెహబాజ్ షరీఫ్ చెప్పిన వెంటనే అక్కడే ఉన్న భారత రాయబారి ఒకరు వ్యంగ్యంగా చిరునవ్వు నవ్వడం కనిపించింది. షరీఫ్ ఈ మాట చెప్పిన వెంటనే అక్కడి కెమెరా భారత రాయబారిపై ఫోకస్ అయింది. ఆ సమయంలో వ్యంగ్యంగా నవ్వుతూ తల అడ్డంగా తిప్పడం అందులో రికార్డయింది. ఈ క్లిప్.. ఇప్పుడు వైరల్ అయింది. ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని అడ్డగోలు వాదనలు చేశారనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్టయింది.
ఆ భారత ప్రతినిధి ఆర్ శ్రీనివాస్. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు భారత తరఫున ప్రతినిధి బృందంలో సభ్యుడు. షరీఫ్ ప్రసంగంలోని ఆవాస్తవాలను ఒక చిరునవ్వుతో కొట్టిపారేసినట్టయింది. హుందాగా తిప్పికొట్టినట్టయింది. ఈ వీడియో క్లిప్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గెలవని యుద్ధాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవడానికి స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రే తాపత్రయ పడుతోండటాన్ని ఈ సీన్ ఎండగట్టిందని అభిప్రాయపడుతున్నారు.
#WATCH | New York | Addressing the 81st United Nations General Assembly (UNGA), Pakistan PM Shehbaz Sharif says, "A year ago, Pakistan faced external aggression from India under a false pretext. Pakistan exercised its inherent right of self-defense under Article 51 of the United… pic.twitter.com/X0SjbLD2n9
— ANI (@ANI) September 26, 2026
ఆ తర్వాత కూడా భారత ప్రతినిధి పెటెల్ గెహ్లాట్.. షెహబాజ్ షరీఫ్ ప్రసంగాన్ని తప్పుపట్టారు. ఆయన చేసిన వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటన్నింటినీ తోసిపుచ్చారు. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం నామమాత్రమేనని, అది పూర్తిగా సైన్యం కనుసన్నల్లో నడిచే ఓ కీలుబొమ్మ ప్రభుత్వమని ఎండగట్టారు. షెహబాజ్ షరీఫ్ ప్రసంగం పూర్తయిన వెంటనే ఆమె మాట్లాడారు. దీనికోసం తన రైట్ ఆఫ్ రిప్లై హక్కును ఉపయోగించుకున్నారు.













Click it and Unblock the Notifications
