తడాఖా చూపిన పీవీ సింధు

జపాన్ లోని నగోయా వేదికగా సాగుతున్న ఆసియా గేమ్స్ లో భారత క్రీడాకారులు తమ విజయాల పరంపరను కొనసాగిస్తున్నారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఘన విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చైనీస్ తైపీకి చెందిన క్రీడాకారిణి చియు పిన్ చియాన్‌ను చిత్తు చేసి ఆమె మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. వ్యక్తిగత విభాగంలో దేశానికి పతకం అందించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన సింధు తొలి మ్యాచ్‌లోనే తడాఖా చూపారు.

ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేక సతమతమవుతున్న సింధుకు ఈ విజయం మానసికంగా ఎంతో ఊరటనిచ్చింది. చైనీస్ తైపీ షట్లర్ చియు పిన్-చియాన్‌పై 21-19, 21-14 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. మ్యాచ్ ఆరంభంలో ప్రత్యర్థి ప్రతిఘటించినప్పటికీ, తన అపారమైన అనుభవంతో పీవీ సింధు దాన్ని అధిగమించారు. నెట్ పై కంప్లీట్ కంట్రోల్ సాధించారు. శక్తిమంతమైన గ్రౌండ్ షాట్లతో పాయింట్ల వేట సాగించారు.

PV Sindhu Beats Chiu Pin-Chian to Reach Women s Singles Third Round with 21-19 21-14 Win in Japan

ఈ మ్యాచ్‌లో సింధు ఆడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఏ దశలో కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో ప్రత్యర్థి ఎత్తుగడలను సమర్థంగా తిప్పికొడుతూ ఆధిపత్యం ప్రదర్శించారు. దాన్ని 21-19 తేడాతో సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఆమె దూకుడు కొనసాగింది. రెండో గేమ్‌లోనూ అదే ఊపుతో ఆడారు. కోర్టు లోపల చురుకైన కదలికలతో ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లతో మ్యాచ్‌ను ముగించారు. 21-14 తేడాతో దీన్ని గెలుచుకున్నారు.

ఫైనల్ లో ఇరాన్ ను కబడ్డీ ఆడేసిన భారత్
ఫైనల్ లో ఇరాన్ ను కబడ్డీ ఆడేసిన భారత్

అంతకుముందు జరిగిన మహిళల బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో జపాన్ చేతిలో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఆ జట్టులో సింధు కూడా ఉన్నారు.. పీవీ సింధు. గత హంగ్జౌ ఆసియా క్రీడల్లో కూడా సింధు వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయి పతకం లేకుండానే వెనుదిరిగారు. ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ ఈసారి ఎలాగైనా సింగిల్స్ విభాగంలో పతకం సాధించాలనే పట్టుదలతో ఆమె ముందంజ వేస్తోన్నారు.

రేపటి నుంచి టీమిండియా వన్డేల జాతర.. !!
రేపటి నుంచి టీమిండియా వన్డేల జాతర.. !!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+