నేటికీ వీడని యూరియా కష్టాలు.. రైతన్న గోసను పట్టించుకోరా?

ఆరుగాలం కష్టపడి జనాల ఆకలితీర్చే అన్నదాతలకు యూరియా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఎన్నడూ లేని విధంగా రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేపట్టగా.. ఇటీవల దాన్ని మూసివేసి కేంద్ర ప్రభుత్వం ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కొత్త యాప్‌పై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో సతమతమవుతున్నారు. ఒకవేళ అన్నదాతలు యాప్‌లో బుక్ చేసుకున్నా క్షణాల్లోనే స్టాక్ అంతా అయిపోయినట్లు చూపిస్తోంది.

గత యాప్ లాగా కాకుండా రైతులు కొత్త యాప్ లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తయిన అన్నదాతల వివరాలు యాప్ లో కచ్చితంగా చూపుతాయని సర్కారు పేర్కొన్నా చాలా మందికి సంబంధించిన వివరాలు యాప్‌లో అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. కొందరు రైతన్నల వివరాలు అసలే కనిపించకపోవడంతో ఏఈవోల వద్దకు పరిగెడుతున్నారు. ఒకే పంట వేర్వేరు సర్వే నంబర్లలో సాగు చేస్తే వేర్వేరుగా బుక్ చేయాల్సి వస్తుండటం తదితర సమస్యలతో అన్నదాతలు గంటల తరబడి ఫోన్లతో కుస్తీ పట్టాల్సి వస్తోంది. గతంలోని యాప్‌లో ఓ మండలానికి సంబంధించి దుకాణం మాత్రమే చూపించేది.. కానీ ప్రస్తుతం కొత్త యాప్ లో ఎక్కడెక్కడో ఉన్న దుకాణాలు, జిల్లాలో ఉన్న షాపులు మొత్తం చూపడం ద్వారా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. రైతులకు కావాల్సింది యూరియా అయితే యాప్‌లో డీఏపీ, యూరియా, ఇలా మూడు రకాలు డిక్కు పెడితే తప్ప బుక్ కావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. యాప్ ద్వారా యూరియా అందించడంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహానికి గురువుతున్నారు. తమకు యాప్ ద్వారా కాకుండా నేరుగా యూరియా ఇవ్వాలని పలువురు అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

Urea App Troubles Trouble Farmers as Fertilizer Booking Becomes Difficult citing technical issues stock shortages

అదనపు ఖర్చులతో రైతన్నల అరిగోసలు
రైతన్నలు ఆరుగాలం కష్టపడి పంటలు పండించాలంటే సకాలంలో యూరియా చల్లాలి. అప్పుడే పంట బాగా ఎదుగుతుంది. ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకోవడంతో రెండు దఫాలుగా యూరియా వేయాల్సి ఉంటుంది. దీంతో చేసేదేం లేక కొందరు అన్నదాతలు యూరియా లిక్విడ్ ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో పంటలు పండించడంలో అదనంగా భారీ ఖర్చు వస్తోందని అన్నదాతలు పోతాతున్నారు. ఈ నేపథ్యంలో పాత విధానంలోనే యూరియా అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

బుక్ చేయడం రాక అన్నదాతల అరిగోసలు
యూరియాను బుక్ చేసుకోవాలంటే యాప్‌లోనే చేసుకోవాలి. రైతుల్లో చాలా మంది చదువుకోని నిరక్షరాస్యులే ఉన్నారు. చాలా మందికి అసలు స్మార్ట్ ఫోన్ అంటే కూడా ఏంటో తెలియని వారున్నారు. ఇక యాప్ ఎలా ఉపయోగించాలో అసలే రాదు. అలాంటి చాలా మంది రైతులు బుకింగ్, ఓటీపీ అంటే ఏంటో తెలియక అరిగోసలు పడుతున్నారు. వివిధ గ్రామాల్లోని రైతులు ఫోన్లు తీసుకొని మండల కేంద్రాలకు, చదువుకున్న యువత వద్దకు పరుగులు పెడుతున్నారు. మరోవైపు మండలాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ.. అన్నదాతలకు తెలియక అయోమయానికి గురవుతున్నారు.

బస్తాల కోసం నానా తంటాలు పడుతున్నా..
ప్రస్తుతం యూరియా బస్తాల కోసం రైతులు ఎన్నో తంటాలు పడుతున్నారు. నేను 5 ఎకరాల్లో వరి వేశాను. యూరియా బస్తాల కోసం జిల్లా మొత్తం తిరగాల్సి వస్తోంది. ఇంతకు ముందు మండల కేంద్రంలో దొరికేవి. ఇప్పుడు కొత్త యాప్ వచ్చాక జిల్లాలో ఎక్కడ దుకాణంలో దొరికినా వెళ్లాల్సి వస్తోంది. అంత దూరం వెళ్లాలంటే ఆటో కిరాయిలు అదనంగా భరించాల్సిందే. రైతేరాజు అనేది చాలా తప్పు.. అది ఎప్పటికీ జరగదు. వ్యవసాయం చేయాలంటే సాగునీరు, ఎరువులు కావాలి. ఈ రెండు ఇస్తే రైతులు చక్కగా పంట పండించుకోగలుగుతారు. అన్నదాతలు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతన్న కన్నీరు పెడితే దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. -జక్కి మల్లయ్య, రైతు

Urea App Troubles Trouble Farmers as Fertilizer Booking Becomes Difficult citing technical issues stock shortages

రైతులకు యూరియా కష్టాలు తీరెదెన్నడో?
గతంలో యూరియా కొనుగోలు పరిమితి లేదు. ఇప్పుడు రైతులు యూరియా దొరకక ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. అనేక మంది రైతులు యూరియా దొరకక లిక్విడ్ ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా రైతులపై అధిక భారం పడుతోంది. అందరికీ సరిపడా యూరియా అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కాస్త రైతుల బాగోగులపై దృష్టి సారించాలని వేడుకుంటున్నాం. -ఉమేశ్, యువ రైతు

మా గోడు వినండయ్యా..
సారూ.. నా పేరు సాయిలు. నా వయస్సు 70 సంవత్సరాలు. 2 ఎకరాల్లో వరి పంటవేసిన. నాకు అసలు చదువు రాదు. నాకు సెల్ ఫోన్ ఎలా వాడాలో తెలీదు. యూరియా బస్తాలు కావాలంటే అదేదే యాప్ ఉందంట. కానీ దాని గురించే మాకు తెలీదయ్యా. గతంలో ఇచ్చినట్లు యూరియా బస్తాలు ఇస్తే బాగుంటుంది సారూ. -గడ్డం సాయిలు, వృద్ధ రైతు

Urea App Troubles Trouble Farmers as Fertilizer Booking Becomes Difficult citing technical issues stock shortages

ఏదేమైనా ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ విధానం, సాంకేతిక సమస్యల వల్ల అన్నదాతలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ ఫోన్లు లేనివారు, చదువురాని సామాన్య రైతులు యాప్‌లో యూరియా బుక్ చేసుకోవడానికి గంటల తరబడి సెల్‌ఫోన్లతో కుస్తీలు పడాల్సి వస్తోంది. గతంలో మాదిరిగా దుకాణాల్లో నేరుగా విక్రయించే విధానాన్ని పునరుద్ధరించాలని అన్నదాతలు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+