తిరుమల భక్తుల ప్రయాణ కష్టాలకు చెక్ - ఇలా చేస్తే..ఇక సులభంగా..!!
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ ఉంది. ఉదయం సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకుశ్రీవారి సర్వదర్శనం 20 గంటల సమయం పడుతుంది. కాగా, భక్తులకు ప్రయాణ కష్టాలకు చెక్ చెప్పే విధంగా టీటీడీ కొత్తగా స్మార్ట్ సేవలు అందుబాటులోకి తెచ్చింది.
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దీంతో.. భక్తులకు దర్శనంతో పాటుగా ఇతర సదుపాయాల కల్పనలో టీటీడీ కీలక మార్పులు చేస్తోంది. అందులో భాగంగా ప్రయాణ కష్టా లకు చెక్ పెట్టే నిర్ణయాలు తీసుకుంటోంది. తిరుమలలో కొత్తగా ప్రారంభించిన ఉచిత ఎలక్ట్రిక్ 'ధర్మ రథం' బస్టాప్‌లను స్మార్ట్‌గా తీర్చిదిద్దేందుకు టీటీడీ నిర్ణయించింది. ఈ బస్సుల పూర్తి సమాచారం భక్తులకు అందుబాటులోకి తెస్తోంది. బస్సుల రూట్.. టూమింగ్స్.. స్టాప్ లతో పాటుగా భక్తుడు వెళ్లాల్సిన ప్రాంతానికి పట్టే సమయం వంటివి వారి స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకునే వెసులు బాటు కల్పిస్తోంది. ఇందు కోసం క్యూ ఆర్ కోడ్ విధానం అందుబాటులోకి తెస్తోంది. ఇందు కోసం తిరుమలలో 20 ప్రధాన బస్ స్టాపులను స్మార్ట్ గా మార్పు చేసేందుకు నిర్ణయించారు.

టీటీడీ తాజా నిర్ణయంతో
ఈ ఎంపిక చేసిన బస్ స్టాపుల్లో తిరుమలలో బస్సులు తిరిగే రూట్ కు సంబంధించిన లొకేషన్‌ను సూచించే ప్రత్యేక క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు బస్టాప్‌నకు చేరుకోగానే తమ మొబైల్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వెంటనే బస్సు వెళ్లే రూట్‌మ్యాప్ స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతుంది. ఆ రూట్ మ్యాప్‌లో తాము దిగాల్సిన ప్రాంతం(లొకేషన్)పై క్లిక్ చేయగానే, తమ గమ్య స్థానానికి బస్సు ఎంత సమయంలో చేరుకుంటుందనే కచ్చితమైన సమయాన్ని చూపిస్తుంది. భక్తులు చాలా మంది తాము ప్రయాణించే బస్సులు.. స్టాపుల సమాచారం లేక బస్సుల్లోని సహాయ సిబ్బంది ద్వారా తెలుసుకుంటున్నారు. అయినా.. సరిగ్గా గుర్తించలేక అయోమయానికి గురవ్వటం గుర్తించిన టీటీడీ ఈ మార్పు తీసుకొచ్చింది. ఈ కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తే భక్తులు ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. తిరుమలలో మొత్తం 50 ఎలక్ట్రిక్ ధర్మ రథాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి మూడు నిమిషాలకు ఒక ఉచిత బస్సు భక్తులకు బస్టాప్‌లో అందుబాటులో ఉండే విధంగా షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
