కుంకుమ పువ్వు సాగు ఇక మన ఇంటిపైనే.. సోలార్ నీడలో సరికొత్త ప్రయోగం

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా పేరున్న కుంకుమపువ్వును (Saffron) ఇప్పుడు ఎవరికీ ఊహించని విధంగా సోలార్ ప్యానెళ్లపై పండించి చూపించారు పరిశోధకులు. కొలరాడో స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక వినూత్న ప్రయోగంతో ఈ అసాధారణ విజయాన్ని సాధించారు. భవనాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తూనే, వాటి కింద ఖరీదైన కుంకుమపువ్వును సాగు చేశారు. దీనివల్ల ఒకవైపు కరెంట్ ఉత్పత్తి కావడంతో పాటు, మరోవైపు సాధారణ సాగు కంటే రెట్టింపు దిగుబడి వస్తూ అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.

సాధారణంగా మొక్కలకు ఎండ ఎక్కువగా ఉండాలని భావిస్తుంటాం. కానీ, సుమారు 40 శాతం కాంతిని మాత్రమే అనుమతించే పారదర్శక సోలార్ ప్యానెళ్ల కింద పెరిగిన కుంకుమపువ్వు మొక్కలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. ఎండలో నేరుగా పెరిగిన మొక్కలతో పోలిస్తే, ప్యానెళ్ల నీడలో సాగు చేసిన మొక్కలు రెట్టింపు పూల దిగుబడినిచ్చాయి. గ్రీన్ రూఫ్‌లపై ఉండే నేల స్వభావం, నీరు నిలవకుండా ఉండే గుణం కుంకుమపువ్వు సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఈ ప్రయోగం ద్వారా స్పష్టమైంది.

How Rooftop Solar Panels Can Double Saffron Yield And Generate Electricity At The Same Time
చైనాకు కోలుకోలేని దెబ్బ. రూ.10,000 కోట్లతో కేంద్రం స్కీమ్..
చైనాకు కోలుకోలేని దెబ్బ. రూ.10,000 కోట్లతో కేంద్రం స్కీమ్..

రూ.60 వేల డాలర్ల నికర ఆదాయం.. విద్యుత్తో పాటు లాభాలు

కొలరాడో బృందం దీనికి సంబంధించిన ఆర్థిక లెక్కలను పరిశీలించగా అద్భుతమైన ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే ఉన్న 46-కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌పై, సుమారు 4,356 చదరపు అడుగుల స్థలంలో ఈ సాగును పరిశీలించారు. విద్యుత్ విక్రయం, ఎండిన కుంకుమపువ్వు అమ్మకాలు, కొత్త మొక్కల తయారీకి ఉపయోగపడే దుంపల విక్రయం ద్వారా ఐదు సంవత్సరాల కాలంలో సుమారు 61,000 డాలర్ల వరకు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇందులో కేవలం విద్యుత్ ద్వారానే ఐదేళ్లలో 13,470 డాలర్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు.

విరుచుకుపడిన తుఫాను! ముక్కలైన జపాన్ డ్రీమ్ ప్రాజెక్ట్.. కానీ
విరుచుకుపడిన తుఫాను! ముక్కలైన జపాన్ డ్రీమ్ ప్రాజెక్ట్.. కానీ

చేతులతోనే కష్టపడితేనే ఫలితం.. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు

కుంకుమపువ్వు తయారీ వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. ఎండిన ఎర్రటి కేసరాల కోసం సుమారు 159 నుంచి 179 పూలను సేకరించి, వాటిని చేతులతో విడదీయాల్సి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పంట చేతికొచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ప్రధాన వ్యవసాయ పనులు ముగిసిపోతాయి కాబట్టి, చిన్న రైతులకు ఇది అదనపు ఆదాయ వనరుగా మారుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉండే భవనాల పైకప్పులను ఉపయోగించుకుంటూ, సోలార్ కరెంట్‌తో పాటు ఇలాంటి వినూత్న వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా నగరాల్లో సరికొత్త హరిత విప్లవానికి బాటలు వేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+