కేబినెట్ విస్తరణ పై తేల్చేసిన హైకమాండ్ - వీరికే ఛాన్స్, ఎన్నికల టీం..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ల కాలం పూర్తి అవుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం.. పార్టీలో పూర్తి ప్రక్షాళన దిశగా ఢిల్లీ కేంద్రంగా కసరత్తు కొనసాగుతోంది. త్వరలో జరిగే గ్రేటర్.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కాగా.. తాజాగా మంత్రివర్గ విస్తరణ పైన ఢిల్లీ నాయకత్వం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రులు అయ్యే వారి విషయంలోనూ దాదాపు స్పష్టత వస్తోంది.
తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన పైన దాదాపు క్లారిటీ వస్తోంది. కొండా సురేఖ రాజీనామా సమయం లో మంత్రివర్గంలో మార్పులు.. చేర్పుల పైన చర్చ జరిగింది. ప్రస్తుతం కేబినెట్ లో కొండా సురేఖ బర్తరఫ్ తో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే.. పార్టీలో కొంత కాలంగా చోటు చేసుకొంటు న్న పరిణామాల వేళ ఏఐసీసీ ఆచి తూచి నిర్ణయం తీసుకుంటోంది. ఈ సారి చేసే మంత్రివర్గ ప్రక్షాళన ఎన్నికల టీంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. దీంతో.. పార్టీ పదవుల విషయంలోనూ పూర్తి స్పష్టత తో కేబినెట్ విస్తరణ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఈ నెల 18వ తేదీన ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. దీంతో, తెలంగాణకు మరొకరిని ఇన్‌ఛార్జిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి నియామకం జరగలేదు. ముకుల్ వాస్నిక్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.

డిసెంబర్ లోనే విస్తరణకు ఛాన్స్..?
కొత్త ఇంఛార్జ్ నియామకం తరువాత రాష్ట్రంలో పరిస్థితులు.. తీసుకోవాల్సిన నిర్ణయాల పైన కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారు మాత్రం ఢిల్లీ లో తమ లాబీయింగ్ కొనసాగిస్తున్నారు. కేబినెట్ విస్తరణలో యాదవ సామాజిక వర్గం నుంచి ఒకరికి చోటు కల్పించే అవకాశం ఉందని ప్రచారం. అదే విధంగా లంబాడా వర్గానికి మంత్రి పదవి ఖాయమైందని తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వరంగల్ నుంచి మాధవరెడ్డిలలో ఒకరిని పరిగణనలోకి తీసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయంలోనూ పార్టీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మార్పు విషయంలోనూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, విస్తరణ డిసెంబర్ వరకు జరిగే అవకాశం లేదని చెబుతున్నారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం జరగనుండటంతో... ఆ తరువాతనే విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. దీంతో.. ఢిల్లీ కేంద్రంగా తీసుకుంటున్న నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications
