యువత కోసం రేవంత్ సంకల్పం.. సరికొత్త టెక్నాలజీ కోర్సులతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాలు!

తెలంగాణ రాష్ట్రంలో యువత భవిష్యత్తును మార్చే దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. పాతకాలపు ఐటిఐ లను ఆధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి సరికొత్త సాంకేతిక కోర్సులను అందించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో టాటా టెక్నాలజీస్ సంస్థతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఏటీసీలను ఏర్పాటు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల ఏర్పాటు

టాటా టెక్నాలజీస్ సంస్థతో కలిసి చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు ఇండస్ట్రీ 4.0 అవసరాలకు తగిన నైపుణ్యాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు సాంకేతిక శిక్షణను ఇస్తున్నారు. మొదటి విడతలో 65 కేంద్రాలను, రెండవ విడతలో 54 కేంద్రాలను మంజూరు చేయడంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

CM Revanth Reddy vision for Telangana youth through Advanced Technology Centres offering modern courses

ఏటీసీ సెంటర్లలో కొత్త కోర్సులు

ఆధునిక వర్క్‌షాప్‌లు, కొత్త యంత్రాలు, ట్రైనింగ్ సామగ్రి అందుబాటులోకి వచ్చాయి. రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 3డి ప్రింటింగ్, ప్రొడక్ట్ డిజైన్, అడ్వాన్స్‌డ్ సీఎన్‌సీ మెషీనింగ్ వంటి కోర్సులు ఏటీసీ సెంటర్లలో నేర్పిస్తున్నారు. లాంగ్-టర్మ్ కోర్సులతో పాటు, 23రకాల షార్ట్-టర్మ్ కోర్సులు కూడా ఉన్నాయి. సాధారణ ఐటిఐ కోసం ప్రస్తుత ఆధునిక పరిశ్రమల అవసరానికి తగినట్టుగా లేకపోవడంతో యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.

రేవంత్ రెడ్డి ఏటీసీలను ఏర్పాటుచేసి యువత ఉపాధి అవకాశాలు

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం రేవంత్ రెడ్డి ఏటీసీ లను ఏర్పాటుచేసి యువత ఉపాధి అవకాశాలు పెంచాలని, అందుకు కావలసిన సాంకేతిక శిక్షణ అందించాలని నిర్ణయించారు.ఈ ఏటిసిలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏటీసీ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి నెలకు రూ.2,000 స్టైఫండ్ ఇచ్చేలా ఆర్థిక శాఖను ఆదేశించారు.

అప్ కమింగ్ పరకాల ఎమ్మెల్యే.. కొండా సుస్మిత పోస్ట్.. పరకాల పాలిటిక్స్ పీక్!
అప్ కమింగ్ పరకాల ఎమ్మెల్యే.. కొండా సుస్మిత పోస్ట్.. పరకాల పాలిటిక్స్ పీక్!

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చాలన్న లక్ష్యంలో యువత కీలకపాత్ర

ఇది ఖర్చు కాదని, యువత భవిష్యత్తుపై పెట్టుబడి అని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని, జపాన్, జర్మనీ వంటి దేశాల్లో అవకాశాలు సాధించేలా భాషా శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చాలన్న లక్ష్యంలో యువత కీలకపాత్ర పోషించాలని ఆయన సూచించారు. నైపుణ్యం, కృషి, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నొక్కి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+