నోరూరించే క్రిస్పీ 'చికెన్ నగ్గెట్స్'.. ఇలా ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోండి..!

చికెన్ అనగానే చాలామందికి నోరూరుతుంది. చికెన్ ను ఎలా చేసినా టేస్టీగానే ఉంటుంది. చికెన్ తో చాలామంది రకరకాల వంటలు చేస్తుంటారు. చికెన్ ను కర్రీ, ఫ్రై, బిర్యానీ, కబాబ్స్ ఇలా అనేక రకాలుగా చేసుకుంటూ ఉంటారు. అయితే చికెన్ తో క్రిస్పీ క్రిస్పీగా ఉండే చికెన్ నగ్గెట్స్ ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా..? చికెన్ నగ్గెట్స్ చాలా రుచిగా ఉంటాయి. అయితే వీటిని ఎక్కువగా రెస్టారెంట్స్ లోనే ఆర్డర్ పెట్టి లాగేస్తుంటారు. ఇంట్లో చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి ఈ సూపర్ టేస్టీ చికెన్ నగ్గెట్స్ ను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

నోరూరించే క్రిస్పీ 'చికెన్ నగ్గెట్స్' తయారీ విధానం చూస్తే ముందుగా కావాల్సిన పదార్థాలు చూస్తే బోన్ లెస్ చికెన్ 500 గ్రాములు, మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ లు, కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ లు, బ్రెడ్ క్రంబ్స్ ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, కారం పొడి ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి అర టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, గుడ్లు రెండు, నూనె తగినంత తీసుకోవాలి.

ChickenNuggets Crispy Recipe Make Restaurant-Style Nuggets Easily at Home crispy chicken nuggets

'చికెన్ నగ్గెట్స్' తయారీ విధానం చూస్తే ముందుగా చికెన్ ముక్కలను చిన్నగా కట్ చేసి కడిగి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లోకి చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. అలా 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ లో గుడ్లను కొట్టి.. కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత ఈ గుడ్డు మిశ్రమంలో ముంచేయాలి. ఆ తర్వాత నూనె వేడి చేయాలి. అందులో ఈ ముక్కలను వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. అంతే సూపర్ టేస్టీ క్రిస్పీ 'చికెన్ నగ్గెట్స్' రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+