ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ కట్లెట్
చికెన్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఇక ఈ వర్షాకాలంలో చికెన్ తో తయారు చేసిన రకరకాల వంటకాలను టేస్ట్ చెయ్యాలని భావిస్తాం. అలాంటి వాటిలో చికెన్ కట్లెట్ చాలా మందికి ఇష్టమైన స్నాక్. ముఖ్యంగా క్రిస్పీ బయటి పొర, లోపల మెత్తటి చికెన్ మిక్స్‌తో దేశీ స్టైల్‌లో తయారు చేస్తే రుచి ఇంకా పెరుగుతుంది. టీ టైమ్, ఈవెనింగ్ స్నాక్ లేదా పార్టీలకు సూపర్ ఆప్షన్. ఇంట్లోనే సులభంగా, తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
చికెన్ కీమా (మిన్స్) – 500 గ్రాములు
ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి) – 2 పెద్దవి
పచ్చి మిర్చి (సన్నగా తరిగినవి) – 3-4
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
గరం మసాలా – 1 టీస్పూన్
ఎర్ర మిర్చి పొడి – 1 టీస్పూన్ (రుచికి తగ్గట్టు)
ధనియాల పొడి – 1 టీస్పూన్
ఉప్పు – అవసరమైనంత
బ్రెడ్ క్రంబ్స్ – 1 కప్ (క్రిస్పీనెస్ కోసం)
బ్రెడ్ స్లైసులు – 2 (పాలలో నానబెట్టి)
కొత్తిమీర & పుదీనా (తరిగినవి) – చిన్న ముద్ద
మైదా లేదా కార్న్ ఫ్లవర్ – స్లర్రీ కోసం
నూనె – వేయించడానికి

తయారీ విధానం:
చికెన్ కీమాలో తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారంపొడి, ధనియాల పొడి, ఉప్పు, తరిగిన కొత్తిమీర-పుదీనా వేసి బాగా మిక్స్ చేయండి. రెండు బ్రెడ్ స్లైసులను పాలలో నానబెట్టి నీళ్లు పిండి, మిక్స్‌లో వేయండి. ఇది కట్లెట్లు విరగకుండా ఉండటానికి సహాయపడుతుంది. మిక్స్‌ను 15-20 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. మిక్స్‌ను చిన్న చిన్న బాల్స్‌గా తీసుకుని ఓవల్ షేప్ తయారు చేయండి.
హోటల్ స్టైల్ క్రిస్పీ కట్లెట్ ఇలా
ఒక బౌల్‌లో కార్న్ ఫ్లోర్ పౌడర్, కొంచెం ఉప్పు, నీళ్లు వేసి పలచన స్లర్రీ తయారు చేయండి. మరో బౌల్‌లో బ్రెడ్ క్రంబ్స్ ఉంచండి. ప్రతి కట్లెట్‌ను ముందు స్లర్రీలో ముంచి, తర్వాత బ్రెడ్ క్రంబ్స్‌లో బాగా రోల్ చేయండి. డబుల్ కోటింగ్ చేస్తే ఇంకా క్రంచీగా వస్తాయి. పాన్‌లో తగినంత నూనె వేడి చేసి, మీడియం ఫ్లేమ్‌పై బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా వేయించండి. అధిక నూనెలో డీప్ ఫ్రై చేస్తే హోటల్ స్టైల్ క్రిస్పీనెస్ వస్తుంది.
టీ లేదా కాఫీతో పాటు సూపర్ ఈవెనింగ్ స్నాక్
ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా 180°C వద్ద 15-18 నిమిషాలు టైం సెట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. తాజా ఉల్లిపాయ స్లైసులు, నిమ్మరసం, పచ్చి మిర్చి మింట్-కొత్తిమీర చట్నీ లేదా టమాటో సాస్‌తో వేడిగా సర్వ్ చేయండి. టీ లేదా కాఫీతో పాటు సూపర్ ఈవెనింగ్ స్నాక్ గా ఇది చాలా బాగుంటుంది. కట్లెట్లు విరగకుండా ఉండాలంటే బ్రెడ్ స్లైస్ బాగా నానబెట్టి మిక్స్ చేయాలి.ఎక్స్‌ట్రా క్రిస్పీ కావాలంటే బ్రెడ్ క్రంబ్స్‌తో పాటు కొంచెం రవ్వ కలపండి.













Click it and Unblock the Notifications